మసాలా ఇడ్లీలు ఎప్పుడైనా విన్నారా .. ఎలా తయారు చేసుకోవాలంటే?

by Prasanna |   ( Updated:2024-07-16 07:51:14.0  )
మసాలా ఇడ్లీలు ఎప్పుడైనా విన్నారా .. ఎలా తయారు చేసుకోవాలంటే?
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది టిఫిన్ లో ఎక్కువ ఇడ్లీని తింటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా మంచిది. కొన్నిసార్లు ఇంట్లో అందరూ తిన్న తర్వాత కూడా మిగిలిపోతాయి. కొందరు సాంబార్ తో తినేస్తుంటారు. మరికొందరు మిగిలిన ఇడ్లీలను ఏమి చేయాలో తెలియక పారేస్తారు. అయితే, ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో మసాలా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు

జీలకర్ర 1 టీ స్పూన్, ఎండు మిర్చి 2, కరివేపాకు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, కాప్సికమ్ 1, క్యారెట్ 1, టమాటాలు 2, పసుపు, ఉప్పు నెయ్యి , మసాలా పొడి, కొత్తిమీర

తయారీ విధానం

ముందుగా స్టవ్ ఆన్ చేసి నెయ్యి, జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఆ తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి. కొంత సేపటి తర్వాత టమోటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి బాగా కలపాలి. దీనికి నీటిని జోడించి, బాగా ఉడికనివ్వాలి. కొంతసేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి, ఇడ్లీని తీసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసి, ఈ మసాలాను వేసుకుని కలపండి. అంతే టేస్టీ టేస్టీ మసాలా ఇడ్లీ రెడీ.

Advertisement

Next Story

Most Viewed