- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Garudasana Yoga: గరుడాసనం ఎలా చేయాలి?
దిశ, ఫీచర్స్ : How to do garudasana yoga pose and benefits| ఈ ఆసనంలో రెండు పద్ధతులుంటాయి. ఈ రోజు మొదటి పద్ధతి నేర్చకుందాం. మొదటగా బల్లపరుపు నేలపై నిటారుగా నిలబడి రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత రెండు కాళ్లు, చేతులు శరీరానికి ఆన్చి నిలబడాలి. ఇప్పడు గోడకుర్చీ పోజిషన్‌లో చేతులు ముందుకు చాచి కాసేపు ఆగాలి. తర్వాత కుడి కాలును ఎడమ మోకాలి పైనుంచి తీసుకెళ్లి కుడి కాలు పాదంతో గట్టిగా అదిమి పట్టాలి. ఇప్పుడు రెండు చేతులను మోచేతుల దగ్గర మలిచి పాములు అల్లుకున్నట్లుగా చుట్టేయాలి. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఎడమ కాలును కదల్చకుండా నేలపై బలంగా ఆన్చాలి. బాడీ బ్యాలెన్స్ కూడా ఎటువైపు వంచకుండా వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలాగే పైన చెప్పిన విధంగా కాళ్లు, చేతులు మార్చి చేయాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఆగేందుకు ప్రయత్నించాలి.
ప్రయోజనాలు:
* నరాల బలహీనత ఉన్నవారికి మేలు చేస్తుంది.
* కండరాల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
* తొడలు, చేతులు, పిక్కలకు మంచి వ్యాయమం.
* భుజాలు, తొడ, కాళ్ల పనితీరు మెరుగుపడుతుంది.
- Tags
- Yoga