Friendship day 2024 : ఫ్రెండ్‌షిప్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారా?.. ఈ ఐడియాలు మీకోసమే!

by Javid Pasha |   ( Updated:2024-08-03 07:21:20.0  )
Friendship day 2024 : ఫ్రెండ్‌షిప్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచిస్తున్నారా?.. ఈ ఐడియాలు మీకోసమే!
X

దిశ, ఫీచర్: నిరాశలో మీరు కూరుకుపోయినా, సంతోషంలో మునిగి తేలుతున్నా ఠక్కున గుర్తుకొచ్చే వ్యక్తి ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకరుంటారు. అతనే లేదా ఆమెనే మీ బెస్ట్ ఫ్రెండ్. ఆత్మీయులు, పరిచయస్తులు ఎంతమంది ఉన్నా ఆ ఒక్కరితో మీకుండే అనుబంధమే వేరు. ఎందుకంటే.. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా.. ఎలాంటి స్వార్థమూ లేకుండా మీగురించి ఆలోచించే వ్యక్తి బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఈ ప్రపంచమంతా ఒక్కటై మీ మీద యుద్ధం ప్రకటించినా సరే.. మీ తరఫున మాత్రమే నిలిచే వ్యక్తులు స్నేహితులు మాత్రమే.

ఈ రోజుల్లో అంత మంచి స్నేహితులు ఎవరూ ఉండటం లేదని కొందరు పెద్దలు చెప్తుంటారు. ఇది కూడా ఒకింత నిజమే కావచ్చు. మన మంచి కోసం చెప్పే జాగ్రత్త కూడా కావచ్చు. కానీ అందరూ అలాగే ఉండరు. సమాజంలో మంచీ చెడూ ఉంటాయి. కొందరు చెడు స్నేహాల వల్ల నష్టపోయి ఉండవచ్చు. అంత మాత్రనా మిగతా వారందరకీ అదే వర్తించదు. ఫైనల్లీ.. స్నేహం ఒక భరోసా, స్నేహం ఒక ధైర్యం.

ప్రేమలో వైఫల్యాలుంటాయి. రిలేషన్‌షిప్‌ బ్రేకప్‌లు ఉంటాయి. కానీ ఇలాంటివేమీ స్నేహంలో ఉండవు. కాకపోతే.. బిజీ లైఫ్‌లో కొందరు రెగ్యులర్‌గా కలుసుకోకపోవచ్చు. తాత్కాలికంగా దూరమై ఉండవచ్చు. కానీ హృదయాంతరాల్లో స్నేహ మాధుర్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ భూమిపై మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు.

మీకు ఏమీ తోచనప్పుడు, ఆపదలో చిక్కుకున్నప్పుడు, ఆవేదన చెందుతున్నప్పుడు నాకెందుకులే.. అనుకునేవారు ఎందరో ఉంటారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి.. ఆ క్షణంలో మీరు పట్టించుకోకపోయినా సరే.. మీ గురించి ఆలోచిస్తారు.. మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తారు. అతనే/ఆమెనే మీ బెస్ట్ ఫ్రెండ్.

ఫ్రెండ్‌షిప్‌ అంటేనే అంత.. దానికి కుల మత భేదాలుండవు. పేద ధనిక తేడాలుండవు. ఆడా మగా అనే బేధ భావాలుండవు.. వివక్షలు అస్సలుండవు. అందుకే స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహాన్ని మరోసారి గుర్తు చేసుకొని, మనసు నిండా సంతోషాన్ని నింపుకొని, మన జీవితంలో కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నందుకు కృతజ్ఞతను ప్రకటించుకునేందుకు ఓ సందర్భం రానే వచ్చింది. అదే ఫ్రెండ్ షిప్ డే.

ఆగష్టు మొదటి ఆదివారాన్ని ఈ ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. చాలా మంది ఇప్పుడు ఎవరి ప్లాన్‌లో వారు ఉండి ఉంటారు. సందర్భం వచ్చింది కాబట్టి రేపు ఏం చేద్దామా? అని ఆలోచిస్తూ డండవచ్చు. ఈ విషయంలో అందరూ ఒకేలా సెలబ్రేట్ చేసుకుంటారని, ఒకేలా ఎంజాయ్ చేస్తారని కాదు గానీ, సాధారణంగా ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చునని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో మీరే చూడండి.

విహార యాత్రలు

మీ బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి లేదా కొంతమంది స్నేహితులు కలిసి ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజు ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లవచ్చు. అక్కడి అందమైన ప్రదేశాలు చూసి ఆనందంలో మునిగిపోవచ్చు. అలాగే ఓ కారును బుక్ చేసుకొని రోడ్ ట్రిప్ వేయవచ్చు. నచ్చిన ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి మీకు నచ్చిన పార్కులోనే, పచ్చని ప్రకృతి ఒడిలోనో సేదతీరుతూ లాగించేయవచ్చు.

రిసార్టులు, రెస్టారెంట్లలో..

ఒక్కొక్కరికీ ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో నగరవాసులు ఎక్కువగా స్పెషల్ డేల సందర్భంగా రిసార్టులు, రెస్టారెంట్లలో భోజనం చేయడం, పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. నచ్చితే ఫ్రెండ్‌షిప్ డేను కూడా ఏ రిసార్టులోనో, రెస్టారెంట్‌లోనో ప్లాన్ చేయవచ్చు. ఒక పెద్ద హాల్ బుక్ చేసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నచ్చిన ఫుడ్ తింటూ, ఫొటోలు దిగుతూ, సరదా సరదా మాటలతో, ఆటలతో గడిపేసి రావచ్చు.

నేరుగా కలుసుకోలేకపోతే..

ఉరుకులూ పరుగుల జీవితంలో స్నేహితుల దినోత్సవం రోజు కూడా మీరు నేరుగా కలుసుకునే చాన్స్ లేదా..? ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉండటంవల్ల ఒక్క దగ్గర మీట్ అవ్వలేకపోతున్నారా? డోండ్ వర్రీ. ఆరోజు మీరంతా జూమ్ మీటింగ్ పెట్టుకోవచ్చు. వీడియో కాల్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడవచ్చు. అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు పంచుకుంటూ సరదా సరదా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ కొన్ని ఐడియాలు మాత్రమే.. మీ ఆసక్తిని బట్టి ప్రయత్నించి చూడండి. ఫ్రెండ్‌షిప్ డేను సెలబ్రేట్ చేసుకునే మార్గాలు ఇంకెన్నో ఉంటాయి అంటున్నారు నిపుణులు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.

Advertisement

Next Story

Most Viewed