INDIA - TOURISTS: బుల్డోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫారినర్స్ దేశ పర్యటన.. వైరల్ అవుతున్న వీడియో

by Sujitha Rachapalli |
INDIA - TOURISTS:   బుల్డోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫారినర్స్ దేశ పర్యటన.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో పర్యటించేందుకు విదేశీ యాత్రికులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడి శిల్పకళ సంపద, ఆచార వ్యవహారాలు, పట్టణీకరణ, గ్రామీణ ప్రాంతాలను చూసేందుకు మరింత మక్కువగా ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు ఫారినర్స్ గుజరాత్ వడోదరలో పర్యటించారు. కానీ సిటీని వీక్షించేందుకు వారు బుల్డోజర్ ఎంచుకోవడమే ఇక్కడ స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యేందుకు కారణమైంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. డిఫరెంట్ రియాక్షన్స్ ఇస్తున్నారు. కొందరు వారికి ఈ ట్రిప్ జీవితకాలం గుర్తుండిపోతుందని అంటున్నారు. మోడీ ఉంటే అలా ఉంటుందని కొందరు అంటుంటే.. ఈ బుల్డోజర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యోగీ జీ స్పాన్సర్ చేసాడా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు ఇంకొందరు. ఇలా ట్రావెల్ చేయడం వల్ల ఏం సంతోషం వస్తుందో అర్థం కావట్లేదని మరికొందరు అంటున్నారు. ఇక ఈ వీడియోలో ఉన్న ముసలాయన అచ్చం మోడిలాగే ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed