- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ 7 టిప్సే ప్రధానం
దిశ, ఫీచర్స్ : నేడు వైద్యం ఖరీదైనదిగా మారుతోంది. ఈ క్రమంలో గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉంటే మేలు జరుగుతుందని సలహా ఇస్తున్నారు నిపుణులు. అది మీకు వాల్యుబుల్ సర్వీస్‌ను, ఫీచర్లను అందిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అధిక ఖర్చులను తగ్గించడంలో, తగిన కవరేజీని అందించడంలో సహాయపడుతుంది. ముందుగా ఇన్వెస్ట్ చేయడంవల్ల ప్రమాదాలు, అనారోగ్యం సంభవించినప్పుడు మీ ట్రీట్మెంట్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో ఇండియాలో సరైన హెల్త్ పాలసీని ఎంచుకోవడానికి అవసరమైన 7 టాప్ టిప్స్ అందిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.
సాధారణంగా సర్‌ప్రైజెస్ చాలా ఎగ్జయిట్మెంట్‌ను ఇస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ, ప్రమాదం లేదా ఊహించని అనారోగ్యం వంటి కొన్ని సర్‌ప్రైజెస్ మీరు జీవితాంతం చేసిన పొదుపును ఖాళీ చేస్తాయి. సరైన ఆరోగ్య బీమా ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వలన అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందడం ద్వారా రక్షించబడవచ్చు. ఇది ఊహించని ఆకస్మిక పరిస్థితుల కోసం మీరు సిద్ధంగా ఉండటానికి అనుమతిస్తుంది. అయితే హెల్త్ పాలసీ తీసుకునేముందు కవరేజ్ ప్రయోజనాలు, కోట్‌ల ఆధారంగా ఆన్‌లైన్‌లో వివిధ ఆరోగ్య బీమా ప్లాన్‌లను పోల్చవచ్చు. వెబ్‌సైట్‌లో మీరు వివరాలను నమోదు చేశాక మీ బడ్జెట్‌కు సరిపోయే వివిధ ప్లాన్‌లను అక్కడ సరిపోల్చవచ్చు.
ఫ్యామిలీ అండ్ ఇండివిడ్యువల్ ప్లాన్
మీ అవసరాలను తీర్చగలిగే పాలసీని ఎంచుకోవచ్చు. ఇక ఆదాయానికి సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్‌లో సరిగ్గా కవర్ చేయబడుతున్నారని నిర్ధారించుకోండి. ప్రారంభంలో ధర కంటే కూడా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం తెలివైన పని. కాలక్రమేణా ప్లాన్‌ను రివ్యూ చేసుకోవచ్చు. ఆదాయం, కుటుంబ సభ్యుల సంఖ్య, అవసరాల పెరుగుదలతో తగిన విధంగా కవరేజీ పెంచుకోవచ్చు. అయితే మీ పాలసీ ప్రీమియంలు సరసమైనవిగా ఉంటూ ఆర్థిక భారంగా మారకుండా చూసుకోవడం మంచిది.
లైఫ్ టైం రెన్యువబిలిటీ
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసినప్పుడు అది లైఫ్ టైం రెన్యువబిలిటీ కలిగి ఉందో లేదో నిర్ధారించుకోండి. మీ వృద్ధాప్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం కష్టంగా ఉండవచ్చు. అప్పుడు ఖరీదైనదిగా కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీరు తీసుకునే ప్లాన్ జీవితకాల రెన్యువలైజేషన్ ఫెసిలిటీ ఉండేలా చూసుకోండి. మీ కుటుంబ ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు అనేక రకాల వైద్య సమస్యలను కవర్ చేసే ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఎంచుకోండి. అలాగే హాస్పిటల్‌కు వెళ్లే ముందు రవాణా ఖర్చులు, కుటుంబ వైద్య చరిత్ర తదితర అంశాలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీ ప్లాన్ మీ అన్ని అవసరాలు తీర్చేలా ఉండాలని గుర్తుంచుకోండి.
క్లెయిమ్ సెటిల్‌మెంట్
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది మొత్తం అందుకున్న క్లెయిమ్‌లకు వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ ప్రొవైడర్ సెటిల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్య. ఎల్లప్పుడూ అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో (CSR) ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి. ఏదైనా ఊహించని ఆర్థిక భారం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు చేస్తున్న ఇన్వెస్ట్ ఇది. కాబట్టి అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండాలి.
హాస్పిటల్ నెట్‌వర్క్
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు మీరు ఇష్టపడే హాస్పిటల్స్, డాక్టర్లు మీరు తీసుకునే ప్లాన్‌లో ఉన్నాయా? హాస్పిటల్ నెట్‌వర్క్‌లో చేర్చబడ్డారో లేదో చెక్ చేసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్ నగదు రహిత సేవలను అందిస్తాయి. డిశ్చార్జ్ సమయంలో కూడా మీరు హాస్పిటల్ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదు.
మీరు ఇండియాలో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం గనుక చూస్తున్నట్లయితే భవిష్యత్తులో రాబోయే అధిక వైద్య ఖర్చుల నుంచి ఫైనాన్షియల్ పరంగా మిమ్మల్ని రక్షించేలా చూసుకోండి. దాంతోపాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మీ పాలసీ పనిచేస్తుందా? ఏయే వాటికి పనిచేస్తుంది చెక్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి: ‘ఐవీఎఫ్ గర్భధారణ’ సురక్షితమేనా.. ఏ వయస్సులో ట్రీట్‌మెంట్ అవసరం?