ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ఆర్థిక ఒత్తిడి.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!

by Jakkula Samataha |
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ఆర్థిక ఒత్తిడి.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!
X

దిశ, ఫీచర్స్ : ఆర్థిక ఒత్తిడి వ్యక్తి మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుందని ఓ సర్వేలో షాకింగ్ విషయం వెళ్లడైంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూకేలోని కింగ్స్ కాలేజ్‌లోని శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది వ్యక్తి నాడీ వ్యవస్థ, రోగనిరోధక శక్తి, హార్మోన్లవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది. పరిశోధకులు అంగవైకల్యం, వియోగం, అనారోగ్యం, ఆర్థిక ఒత్తిడి, విడాకుల సమస్యలతో బాధపడుతున్న,50 ఏళ్ల పైబడిన 5000 మందిని పరిశీలించగా, ఇందులో ఆర్థిక ఒత్తిడి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వెళ్లడైనట్లు తెలిపారు.

సాధరణ సమస్యలతో బాధపడుతున్నవారితో పోలిస్తే, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు.ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అని అన్నారు. ఈ ఒత్తిడి జీవితంలో అనేక సమస్యలను తీసుకొస్తుంది. కుటుంబ కలహాలకు, ఆకలి లేదా నిరాశ్రయతకు దారి తీస్తుందని, ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉన్నదంట.అలాగే ఈ తీవ్రమైన ఒత్తిడి శరీరంలో హార్మోన్ల మార్పులకు గురిచేయడం వలన శ్వాస, రక్తపోటు, హృదయస్పందన రేటు పెరిగే అవకాశం ఎక్కువ. అంతే కాకుండా ఆర్థిక ఒత్తిడి వలన వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుందంట.

Advertisement

Next Story