- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Honey Badger: భయం దీని బ్లడ్ లోనే లేదు.. పులులు, సింహాలను సైతం మట్టికరిపించగల జంతువు ఉందని తెలుసా
దిశ, ఫీచర్స్: సాధారణంగా సింహాలు, పులులు , ఏనుగులను చూసి ఏ జంతువైన భయపడాల్సిందే. పులిని టీవీలో చూసిన కొంతమంది భయపడుతుంటారు. వీటికి కొంచం కూడా భయమే ఉండదని చెబుతుంటారు. అందుకే మన తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కానీ, ఈ మూడింటిని భయ పెట్టె జంతువు కూడా ఉందని చాలా మందికి తెలీదు.
భయం దీని బ్లడ్ లోనే లేదు.. ఈ జంతువు అడవిలో ఎక్కడికైనా వెళ్లగలదు. అదే హనీ బ్యాడ్జర్. ఇది చిన్నగా ఉంటుంది. కానీ దీనికున్న తెలివికి ఎవరూ సరిపోరు. ఇది ఎంత ధైర్యంగా ఉంటుందంటే.. దీని ముందు ఎంత విష సర్పాలయిన పక్కకు తప్పుకోవాల్సిందే.
ఇది మోస్ట్ ఫియర్‌లెస్ యానిమల్‌గా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది. పులులు, సింహాలు సైతం మట్టికరిపించగలదు. హనీ బ్యాడ్జర్స్ దంతాలు చాలా బలంగా ఉంటాయి. వీటి గోర్లు అతి భయంకరంగా ఉంటాయి. ఇవి కొన్నేళ్లు పోతే మన కంటికి కూడా కనిపించవు. ఇవి అంతరించిపోనున్న లిస్టులో ఉన్నాయి. ఇవి ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీని మీద ఏ జంతువు దాడి చేసిన తిరిగి చాలా క్రూరంగా దాడి చేస్తాయి.
గమనిక: క్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.