Eye Health : కళ్లు నొప్పి పుడుతున్నాయా..? ఇలా నవ్వితే చాలు.. ప్రాబ్లం క్లియర్!!

by Javid Pasha |   ( Updated:2024-12-18 07:01:53.0  )
Eye Health : కళ్లు నొప్పి పుడుతున్నాయా..? ఇలా నవ్వితే చాలు.. ప్రాబ్లం క్లియర్!!
X

దిశ, ఫీచర్స్: ‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. నవ్వు నాలుగు విధాలా మేలనేది అధ్యయనాలు తేల్చేశాయి. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలై బ్రెయిన్ యాక్టివిటీని పెంచుతాయి. అలాగే ఇవి నర్వ్ సిస్టమ్‌పై సానుకూల ప్రభావం చూపడంవల్ల మొత్తం ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడి, ఆందోళనలు కూడా తగ్గుతాయనే విషయం మనకు తెలిసిందే. అయితే వీటితోపాటు ‘నవ్వడం’ ఇప్పుడు కంటి ఆరోగ్యానికి కూడా మంచిదని ‘బ్రిటీష్ మెడికల్ జర్నల్‌’లో పబ్లిషైన ఓ అధ్యయనం పేర్కొంటున్నది.

సాధారణంగా నవ్వు ఒత్తిడి, ఆందోళనలు, కుంగుబాటు వంటివి తగ్గిస్తుందని ఇప్పటి వరకూ అనుకున్నాం. అయితే అది నరాలను ప్రభావితం చేయడంవల్ల కళ్లు పొడిబారే సమస్యను కూడా దూరం చేస్తుందని యూకే, చైనాకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా 18 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సుగల 283 మందిని వీరు పరీక్షించారు. రెండు గ్రూపులుగా విభజించి కొందరికి ఐ డ్రాప్స్, మరీ కొందరికి లాఫింగ్ థెరపీ వంటివి సూచించారు. రోజుకు నాలుగుసార్లు ఎనిమిది వారాలపాటు ఐ డ్రాప్స్ వాడాలని ఒక గ్రూపునకు చెప్పారు. అలాగే లాఫింగ్ థెరపీలో భాగంగా ‘హ్హ హ్హ హ్హ.. హ్హి.. హ్హి హ్హి’ అని 5 నిమిషాల్లో 30 సార్లు నవ్వాలని కూడా రెండవ గ్రూపునకు సూచించారు. ఈ సందర్భంగా పరిశోధకులు ముఖ కవళికలను ఫేస్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ద్వార్వా అబ్జర్వ్ చేశారు. కాగా కేవలం ఐ డ్రాప్స్ వాడిన వారిలోనూ, అవి వాడకుండా కేవలం నవ్వడం ప్రాక్టీస్ చేసిన వారిలోనూ కళ్లలో మంట, కళ్లు పొడిబారడం వంటి సమస్యలను తగ్గించడంలో దాదాపు ఒకే విధమైన ఫలితాలు వెల్లడైనట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి కళ్లు పొడిబారే సమస్య ఉన్నప్పుడు లాఫింగ్ ఎక్సర్‌సైజ్ చేయడంవల్ల కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే కంటి వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story