- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి..
by Sumithra |
X
దిశ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయాలపాలైన వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఎక్సెల్ బండి పై ఉన్న కంటే రాములుకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువ అయి మార్గమధ్యంలో మృతి చెందాడు.
స్ప్లెండర్ ప్లస్ బైక్ పై ఉన్న గడ్డం సంజయ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కంటే రాములును బ్రతికించడానికి అంబులెన్స్ సిబ్బంది ఎంతగానో ప్రయత్నించారు. చివరికి ఆసుపత్రికి చేరకుండానే రాములు మృతి చెందాడు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైనింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
Advertisement
Next Story