సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

by Naveena |
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
X

దిశ, కామారెడ్డి టౌన్ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్ చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు..బుధవారం సంఘీభావం తెలిపి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ..విద్యాశాఖలో భాగంగా పని చేస్తూ, గత ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చట్టబద్ధంగా నియమించబడ్డారన్నారు. వారిని రెగ్యులరైస్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పే స్కేల్ అమలు చేయాలని లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి అన్ని వసతులనైనా కల్పించాలన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ఇదే సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఇప్పుడు వీరి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story