- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లు చురుకుగా జరగాలి : మెదక్ కలెక్టర్
దిశ, కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన ఏర్పాట్లు చురుకుగా సాగాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సభా ప్రాంగణం, ఏలి ప్యాడ్ ను, సేంద్రియ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయు స్థలాలను నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ సర్దార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ సంబాజీ దత్తాత్రేయ నస్కర్, కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా సీటింగ్ ఏరియా, సభా ప్రాంగణం, ఏలిఫ్యాడ్, సేంద్రియ ఉత్పత్తులు ఎగ్జిబిషన్, తదితర ఏర్పాట్లపై ప్రణాళిక బద్ధంగా అధికారులకు తగు సూచనలు సలహాలు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సమయం దగ్గర పడుతున్నందున ఏర్పాట్లు చురుకుగా సాగాలని విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, ప్రభుత్వం తరఫున చేస్తున్న ఏర్పాట్లపై ప్రణాళిక బద్ధంగా వివరించారు. కౌడిపల్లి మండలం రైతుల భూములలో ఎలిఫాడ్స్ ఏర్పాటు చేయుచున్న సందర్భంలో కార్యక్రమం అనంతరం వారికి భూమిని వారికి అప్పజప్పాలన్నారు. సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలు వివరాలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు, ముఖ్య అతిథులను ఆకట్టుకునే విధంగా ఉండాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై 500 మంది రైతులు,ఇతర రైతులు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.