- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi: మోడీ విధానాల వల్ల ఉత్పాదక రంగం బలహీన పడిపోయింది
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విధానాలపై లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్ట ప్రకారం జరిగే వ్యాపారాలను పట్టించుకోకుండా క్రోనీ బిజినెస్(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) కి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉత్పాదక రంగం బలహీనపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ(Modi government) అవలంభించే ఇటువంటి చర్యల వల్ల ఉత్పాదక రంగం బలహీన పడటమేకాక, కరెన్సీ విలువ పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు(Trade deficit), అధిక వడ్డీ రేట్లు పెరుగుతాయని అన్నారు. దీంతో, వస్తువుల వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివన్నీ చూస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వాణిజ్య లోటు, దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయని వస్తున్న మీడియా స్టోరీలను సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేస్తూ కేంద్రంపై మండిపడ్డారు. ప్రభుత్వాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలకు ప్రాధాన్యమిస్తే ఇలాకాక ఇంకేం జరుగుతుందని రాహుల్ ప్రశ్నించారు.
గతేడాదితో పోలిస్తే..
ఇకపోతే, నవంబరులో దేశీయ వాణిజ్య ఎగుమతులు ఏడాదిక్రితం ఇదే నెలతో పోలిస్తే 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 27 శాతం పెరిగి రికార్డు స్థాయి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి. ప్రధానంగా పసిడి దిగుమతులు గణనీయంగా పెరగడం వల్లే, వాణిజ్యలోటు ఇంతగా నమోదైందని వాణిజ్యశాఖ వర్గాలు తెలిపాయి. పసిడి దిగుమతులు గత నెలలో 14.86 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. 2023 నవంబరులో బంగారం దిగుమతులు 3.44 బిలియన్ డాలర్లతో పోలిస్తే, ఇవి 4 రెట్లు అధికం. వంట నూనె, ఎరువులు, వెండి అధిక ఇన్‌బౌండ్ షిప్‌మెంట్ల కారణంగా దిగుమతులు సంవత్సరానికి 27శాతం పెరిగి రికార్డు స్థాయిలో 69.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.