- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామస్తుల పై ఇసుక మాఫియా దాడి..?
దిశ, కోరుట్ల : కోరుట్ల నియోజకవర్గంలో అక్రమ ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సహనం కోల్పోయిన గ్రామస్తులు ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దాడికి పాల్పడినట్లు సమాచారం. అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకున్న గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కోరుట్ల రెవెన్యూ అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ట్రిప్పుల అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇదంతా ఓ పెద్దమనిషి పనేనని ఆ అక్రమ ఇసుక డంపులను రాత్రికి రాత్రే తరలించేందు ఇసుక మాఫియా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పై విషయమై కోరుట్ల తహశీల్దార్ కిషన్ వివరణ కోరగా ప్రస్తుతం దాదాపు 50 ట్రాక్టర్ ల గల ఇసుకల డంపులను పట్టుకున్నామని ప్రస్తుతం రెండు ట్రాక్టర్ లను అదుపులోకి తీసుకున్నామని మరింత సమాచారం అందజేస్తామని తెలిపారు.