Trinamool Congress అమిత్ షా వ్యాఖ్యలతో ముసుగు వీడిపోయింది.. బీజేపీపై దీదీ విమర్శలు

by Shamantha N |
Trinamool Congress అమిత్ షా వ్యాఖ్యలతో ముసుగు వీడిపోయింది.. బీజేపీపై దీదీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అంబేద్కర్‌ మార్గదర్శకత్వం, స్ఫూర్తిబాటలో నడిచే లక్షలాది మందికి అమిత్ షా వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ మాస్క్ వీడిపోయిందన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులోనే అంబేడ్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ద్వేషంతో నిండిపోయిన పార్టీ నుంచి ఇంకేమి ఆశించగలమంటూ కాషాయ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇది బీజేపీ కులతత్వ, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శన. లోక్ సభ ఎన్నికల్లో 240 సీట్లు వస్తేనే ఇలా ప్రవర్తిస్తుంటే.. ఒకవేళ వాళ్లు 400 స్థానాల్లో గెలిచి ఉంటే కలిగే నష్టాన్ని ఊహించండి. 400 సీట్ల కాషాయ పార్టీ కలను సాకారం చేసి ఉంటే.. అంబేద్కర్ చేసిన కృషిని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా చరిత్రను తిరగరాసి ఉండేవారు’ అని కమలం పార్టీపై దీదీ ఫైర్ అయ్యారు.

లక్షలాది మందిని అవమానించారు

అంబేద్కర్ ని ప్రేరణగా, మార్గదర్శకునిగా చూస్తున్న లక్షలాది మందిని అమిత్ షా వ్యాఖ్యలు అవమానించాయని దీదీ అన్నారు. అయితే ద్వేషం, మతోన్మాదంతో కూరుకుపోయిన పార్టీ నుంచి ఇంకేమి ఆశించగలరని ప్రశ్నించారు. కాగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) షాకిచ్చింది. రాజ్యాంగంపై (Rajya Sabha) చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒ‌బ్రియెన్‌ షాపై రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్‌ మోషన్‌) నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన అనంతరం డెరెక్‌ ఒ‌బ్రియెన్‌(Derek O'Brien) మాట్లాడుతూ అమిత్‌ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను తక్కువ చేయడమే కాకుండా సభా మర్యాదను తగ్గించాయన్నారు. సభా మర్యాదను కించపరిచినందుకు అమిత్ షా పై చర్య తీసుకోవాలని ఒబ్రియెన్‌‌ కోరారు.

Advertisement

Next Story

Most Viewed