పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

by Naveena |
పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
X

దిశ,వీపనగండ్ల: మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిరసనకు దిగారు. మూడు రోజులుగా గ్రామం పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో..రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ జబ్బార్ పాల్గొని మాట్లాడుతూ..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లతోపాటు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. దీక్ష శిబిరానికి తహసిల్దార్ కార్యాలయం నుండి ఆర్ ఐ కురుమూర్తి,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ వచ్చి..సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు,ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి, నాయకులు పెద్దకాజా,మాజీ సర్పంచ్ కాంతమ్మ,గ్రామ కార్యదర్శి రవి ప్రసాద్, వెంకటస్వామి, ఖాజా హుస్సేన్ రేవతమ్మ,శ్రీనివాసులు, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు,

Advertisement

Next Story

Most Viewed