బంగారం షోరూమ్‌లో సినీ ఫక్కీలో చోరీ.. నిమిషాల్లోనే దొంగ అరెస్ట్

by srinivas |
బంగారం షోరూమ్‌లో సినీ ఫక్కీలో చోరీ.. నిమిషాల్లోనే దొంగ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో ఓ బంగారం షోరూమ్‌లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. సైలెంట్‌గా షోరూమ్‌లోకి ప్రవేశించిన దొంగ.. ఉద్యోగిని గన్‌తో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు. షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ట్రాఫిక్, కాకినాడ వన్ టౌన్ పోలీసులు నిమిషాల్లో ఛేదించారు. ఫారెస్ట్ ఆఫీస్ వద్ద జాయింట్ ఆపరేషన్ చేశారు. బంగారంతో పారిపోతున్న దొంగను ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. దొంగ వద్ద స్వాధీనం చేసుకున్న గన్ డమ్మీదని గుర్తించారు.

Advertisement

Next Story