దిశ ఎఫెక్ట్...ఘట్కేసర్ లో నాలా కబ్జా తొలగింపు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్...ఘట్కేసర్ లో నాలా కబ్జా తొలగింపు
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణం శివారెడ్డి గూడ మారుతీనగర్లో వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాలాను కబ్జా చేస్తూ మట్టి డంప్ చేసి భారీ గోడ కొట్టారని ఈనెల 14వ తేదీన దిశలో ఘట్కేసర్ లో నాలా కబ్జా శీర్షికతో ప్రచురించిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. బుధవారం ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్వర్ మున్సిపల్ సిబ్బందితో నాలా కాబ్జాను జేసీబీతో తొలగించారు. నాలా కబ్జా చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఇరిగేషన్ ఏఈ తెలిపారు.

Advertisement

Next Story