- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Instant Stress Relief : 20 సెకన్లపాటు ఇలా చేస్తే ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కోవచ్చు !
దిశ, ఫీచర్స్ : మారుతున్న కాలంతోపాటు వర్క్ లండ్ లైఫ్ కల్చర్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా దినచర్యలు మారిపోతున్నాయి. రకరకాల కారణాలతో పలువురు సాధారణంకంటే ఎక్కువగా టెన్షన్ అండ్ స్ట్రెస్ అనుభవిస్తున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలతో మరికొందరు అవస్థలు పడుతుంటారు. ఏ క్షణం ఏ మూడ్‌లో ఉంటారో అర్థం కాని పరిస్థితిలో పలువురు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో టైపర్ టెన్షన్ అధికమై హార్ట్ ఎటాక్ వరకూ దారితీయవచ్చు. అందుకే ఒత్తిడిలేని జీవితం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే ప్రాణాల మీదకు రావచ్చు. ముఖ్యంగా బీపీ పేషెంట్లు, గుండె జబ్బులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.
శారీరక శ్రమ, పలు రకాల వ్యాయామాలు, మెడిటేషన్స్ వంటివి స్ట్రెస్ రిలీఫ్ కోసం పనిచేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇవి దీర్ఘకాలిక అంశాలతో ముడిపడి ఉంటాయి. కానీ ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కోసం ఏం చేయాలనేదే చాలా మందికి ఒక సందేహంగా ఉంటుంది. అయితే వాగస్ నాడీని లక్ష్యంగా చేసుకొని 20 సెకన్లపాటు చేయదగిన ఇన్‌స్టంట్ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ ఇందుకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ పాటిస్తే ఎంత తీవ్రమైన ఒత్తిడి నుంచి అయిన తక్షణ ఉపశమనం పొందుతారని పేర్కొంటున్నారు.
20 సెక్లన్ల ఇన్ స్టంట్ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ వాగస్ నాడీని ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి ఇది శరీంలో పొడవైన కపాల నాడి. హార్ట్ రేట్, జీర్ణక్రియ, ఒత్తిడి వంటి శారీర విధుల నియంత్రణలో ఇది కీ రోల్ పోషిస్తుంది. వాగస్ నాడీని ప్రేరేపించడంవల్ల శరీరం యొక్క పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సెట్ చేయవచ్చు. ఎందుకంటే ఇది రిలాక్సేషన్‌ను ప్రేరేపించడం ద్వారా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్ ఫీలింగ్స్‌ను నివారిస్తుంది.
ఎలా చేయాలి?
* తక్షణ ఉపశమనం కోసం వాగస్ నాడి పవర్‌ను ఉపయోగించుకోవడానికి 20-సెకన్ల ‘వూ’ ట్రిక్ అవసరం. అందుకోసం ముందుగా మీరు కంఫర్టబుల్ అండ్ సేఫ్‌గా భావించే ప్రదేశంలోకి వెళ్లండి.
* ఆరు సెకన్లపాటు పాటు శ్వాసను పీల్చుకోండి. అలాగే మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు తక్కువ రంబ్లింగ్ ‘వూ’ సౌండ్ చేయండి.
* మీరు స్టమక్, అలాగే డయాఫ్రాగమ్ ద్వారా వైబ్రేషన్స్‌ను ఫీల్ అవూతూ.. సహజ ఉచ్ఛ్వాసం ముగిసేవరకు ‘వూ’ సౌండ్‌ను కొనసాగించండి.
* డీప్ బ్రీతింగ్ : ఇన్‌స్టంట్ స్ట్రెస్ రిలీఫ్ కోసం మరో టెక్నిక్ డీప్ బ్రీతింగ్. మీరు ఊపరిని పీల్చినప్పుడు మీ ఉదర భాగం గాలితో నిండి విస్తరిస్తుంది. అప్పుడు మీ శ్వాసను ఒక క్షణం పాటు బిగపట్టుకోండి. ఆపై నెమ్మదిగా మీ నోటి ద్వారా ఊపిరి పీల్చుకోండి. ప్రతి శ్వాసలో టెన్షన్ లేదా స్ట్రెస్‌ను బయటకు రిలీజ్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వండి.
* నీటిని పుక్కిలించడం : చివరగా ఒక సిప్ నీటిని తీసుకొని ఉమ్మి వేయడానికి ముందు కొన్ని సెకన్లపాటు పుక్కిలించండి. ఈ విధమైన గార్లింగ్ యాక్టివేట్స్ గొంతు వెనుక భాగంలోని కండరాలను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఇవి వాగస్ నాడీతో అనుసంధానించ బడి ఉంటాయి. శరీరంలో రిలాక్సేషన్ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తాయి. అయతే ఇన్‌స్టంట్ స్ట్రెస్ అండ్ టెన్షన్ రిలీఫ్ కోసం పాటించే ఈ 20 సెకన్ల ట్రిక్ బెనిఫిట్స్‌ను పొందాటంటే దానిని పాటించడంతోపాటు స్థిరత్వం, ఏకాగ్రత, మైండ్ ఫుల్‌నెస్ కూడా చాలా ముఖ్యం.