- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాత్రి నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం వస్తుందా..అయితే డేంజర్లో పడ్డట్టే అంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: మనలో చాలామంది రాత్రి నిద్ర పోతున్నప్పుడు పక్కన ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా కూడా అలానే పడుకునిపోతారు. ఈ సమయంలోనే కొంత మందికి నోటి నుండి లాలాజలం వస్తుంటుంది. కానీ, ఇది కలలో జరుగుతుందని భ్రమ పడుతుంటారు. అయితే, నోటి నుంచి లాలాజలం రావడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇలా రావడానికి తీవ్రమైన కారణాలు ఉన్నాయి. ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మిలో ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మెదడు సమస్య
నోటి నుండి లాలాజలం వస్తే, అది నాడీ సంబంధిత వ్యాధులను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం కండరాలను నియంత్రించలేనప్పుడు.. రాత్రిపూట నోటి నుండి లాలజలం వస్తుంది. దీని వలన స్ట్రోక్, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
ఇన్ఫెక్షన్
శరీరంలో ఇన్ఫెక్షన్ కారణంగా కొన్నిసార్లు నోటి నుండి లాలాజలం బయటకు వస్తుంది. ముఖ్యంగా గొంతు, సైనసైటిస్, టాన్సిల్స్ వంటి సందర్భాల్లో నోటి నుంచి విపరీతంగా లాలాజలం కారుతుంది.
అలర్జీ
అలర్జీ సమస్య ఉన్న వారికి అదే పనిగా నోటి నుంచి లాలజలం వస్తుంటుంది. లాలజల గ్రంథి శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని వేగవంతం చేస్తుంది. దీని వలన లాలాజలం పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.