ఆ సమయంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారా?.. మీ ఆలోచన మార్చుకోండి !

by samatah |   ( Updated:2023-08-11 06:13:01.0  )
ఆ సమయంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారా?.. మీ ఆలోచన మార్చుకోండి !
X

దిశ, ఫీచర్స్ : రిలేషన్‌షిప్‌‌లో మనశ్శాంతి కోల్పోవడానికి గల అనేక కారణాల్లో లైంగిక సంతృప్తి లేకపోవడం కూడా ప్రధానంగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. భాగస్వాముల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, సరిగ్గా శృంగారానికి ఉపక్రమించే సమయంలోనే నెగెటివ్ థాట్స్ వేధించడం, రకరకాల అనుమానాలు మదిలో మెదలడం సెక్సువల్ లైఫ్‌లో హ్యాపీనెస్ కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు. అలాగే అనవసర భయాలు, అపోహలు కూడా ఫిజికల్‌ అండ్ ఎమోషనల్ హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతాయని, శృంగార జీవితంపట్ల విరక్తి కలిగిస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

సెక్స్‌లైఫ్ ఎంజాయ్ చేయాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ, సరిగ్గా ‘అక్కడికి’ వెళ్లేసరికి టెన్షన్ పడుతుంటారు కొందరు. తమ పర్ఫామెన్స్ సరిగ్గా ఉంటుందో లేదోనని నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఇది కేవలం మానసికమైన ఆందోళన మాత్రమే తప్ప మరొకటి కాదు. ఎటువంటి శారీరకలోపాలు లేకపోయినా ప్రతికూల ఆలోచనవల్లే శృంగారాన్ని ఆస్వాదించలేకపోవడానికి ఇదే అసలైన కారణం. మరికొందరు తమ బాడీ లుక్స్ గురించి పార్ట్‌నర్ ఏమనుకుంటారోనని లోలోన ఫీలవుతుంటారు. భాగస్వామిని సంతృప్తి పరుస్తామా లేదా అని అవనవసరంగా డౌట్ పెట్టుకుంటారు. ఇలా లేనిపోని ఆలోచనలతో ఆత్మ విశ్వాసం కోల్పోయి నిజంగానే సెక్సువల్ లైఫ్ అంటే బోర్ కొట్టడమో, ఒక విధమైన భయం ఏర్పడటమో జరుగుతుంది. దాదాపు 35 శాతం జంటల్లో లైంగిక సంతృప్తి కలగకపోవడానికి కేవేలం నెగెటివ్ థాట్స్ మాత్రమే రీజన్ అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి శృంగార జీవితం ఆనంద మయం కావాలంటే ప్రతీ ఒక్కరు ముందుగా తమలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టుకోవాలని, అప్పుడే సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారని చెప్తున్నారు.

Read More: స్త్రీలు ఇతరులకు అస్సలే ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా?

Advertisement

Next Story