- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూమిపై ఆక్సిజన్ పెరిగినా నష్టమే.. ఏం జరుగుతుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : మన వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి అనేక వాయువులు ఉన్నాయి. ఇందులో మానవ మనుగడకు, పలు ఇతర జీవజాలానికి ప్రధానమైన వాయువు ఆక్సిజన్. ప్రస్తుతం భూమి యొక్క వాతావరణంలో కనీసం 21 శాతం నుంచి గరిష్టంగా 79 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువగా లేదా 90 శాతం వరకు పెరిగితే ఏం జరుగుతుంది? అనే అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. కానీ అదే జరిగితే నష్టం కూడా వాటిల్లుతుందని నిపుణులు చెప్తున్నారు.
జీవజాలానికి నష్టం
ఆక్సిజన్‌తోపాటు అనేక వాయువులు వృక్షజాలం, జంతుజాలం యొక్క శ్రేయస్సును, మనుగడను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి జీవి మనుగడకు, జీవనోపాధికి ఇది అవసరం. మన అవయవాలు, సరైన కణజాలాల పనితీరుకు ఆక్సీజన్ చాలా ముఖ్యం. అయితే ఆక్సిజన్ లెవల్స్ ప్రస్తుతం ఉన్న 21 శాతం నుంచి 90 శాతానికి పెరిగితే మాత్రం మనుగడ కష్టం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ సాంద్రతలో ఇటువంటి నాటకీయ పెరుగుదల భూమి యొక్క పర్యావరణ వ్యవస్థపై, మానవ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది.
ఆరోగ్యంపై ప్రభావం
అధిక ఆక్సిజన్ లెవల్స్ దహన ప్రక్రియలను వేగవంతం చేస్తాయి. భూమిపై మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి, జీవ అధోకరణం చెందగల పదార్థాలు వినాశనానికి ఆక్సిజన్ అధిక పెరుగుదల కారణం కావచ్చు. అంతేకాకుండా దాని లెవల్స్ పెరగడంవల్ల ‘ఆక్సిజన్ టాక్సిసిటీ’కి దారితీస్తుంది. ఈ కండిషన్‌లో మానవ రక్తప్రవాహంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగి, కణాలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల పతనం, రెటీనా డిటాచ్‌మెంట్, మూర్ఛలు వంటివి సంభవిస్తాయి. అలాగే వాయువులలో అసమతుల్యత మొక్కల జీవితానికి అంతరాయం కలిగించవచ్చు. పర్యావరణ వ్యవస్థ యొక్క ఆహార గొలుసులో ఈ అంతరాయం శాకాహార జంతువులను ప్రభావితం చేస్తుంది. వాటికి జీవనోపాధి లేకుండా పోతుంది. పర్యావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.