- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీరు సంతోషంగా ఉండాలా ?.. సెల్ఫ్ బౌండరీస్ సెట్ చేసుకోండి !
దిశ, ఫీచర్స్ : మీరు క్రికెట్ ఆడాలంటే.. ఆ గేమ్‌లో ఉన్న రూల్స్ అండ్ బౌండరీస్ పాటించాలి. వాటిని అనుసరిస్తూనే బెస్టుగా ఆడే ప్రయత్నం చేయాలి. లైఫ్ కూడా అంతే. ఏది సాధించాలన్నా, మంచి మంచి అవకాశాలు సొంతం చేసుకోవాలన్నా కొన్ని సెల్ఫ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు సరిహద్దులు నిర్ణయించుకోవడం విజయానికి ఆటంకంగా మారుతాయని చెప్తుంటారు. కానీ అన్ని విషయాల్లోనూ ఇది నిజం కాదు. పైగా మీకంటూ కొన్ని పర్సనల్ అండ్ సెల్ఫ్ బౌండరీస్ లేకుంటే సక్సెస్ సాధ్యం కాదంటున్నారు నిపుణులు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎటువంటి సెల్ఫ్ బౌండరీస్ అవసరమో సూచిస్తున్నారు.
ఆకలి వేసినప్పుడు, రెస్ట్ అవసరం అయినప్పుడు, వివిధ సందర్భాల్లో పర్సనల్ స్పేస్ కావాలనిపించినప్పుడు నిర్మొహమాటంగా మీ బౌండరీస్ పాటించడంవల్ల సంతోషంగా ఉండగలుగుతారు. దీంతోపాటు భావోద్వేగాలను మేనేజ్ చేయడం, మెయింటెన్ చేయడంలోనూ సొంత ఆలోచనలు, సరిహద్దులు కలిగి ఉండాలి. ఇక ఎమోషనల్ బౌండరీస్ అన్నీ భావాలతో ముడిపడి ఉంటాయి. వాటిని కలిగి ఉండటంవల్ల మీరు హ్యాపీగాఉండగలుగుతారు. పైగా ఎవరితో ఏ విషయాలను చెప్పుకోవాలో, భావాలను వ్యక్తం చేయాలో తెలుసుకోవడం ఇందులో ముఖ్యం.
సమయం - సందర్భం
ఎవరికైనా సమయం, సందర్భం చాలా ముఖ్యం. దానిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మీ పరిధిలో ఉండేలా చూసుకోండి. పనిలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో మీ కంఫర్టును బట్టి టైమ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. దీనివల్ల మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడంతో పాటు మీరు చేసే పనిలో శ్రద్ధ చూపుతారు. అన్నింటికీ అతిగా కట్టుబడి ఉండకుండా తగినంత సమయాన్ని మాత్రమే కేటాయించండి. ప్రాధాన్యతలను మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇతర వ్యక్తులకు ఇచ్చే సమయాన్ని పరిమితం చేయడం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు ‘ఈ వారాంతంలో నేను ఆ ఈవెంట్‌కి రాలేను, నేను ఒక గంట మాత్రమే ఉండగలను. ఈరోజు చాట్ చేయడానికి మీకు సమయం ఉందా?’’ అనేవి టైమ్ బౌండరీస్‌గా పేర్కొనవచ్చు. దీంతోపాటు లైంగికత విషయంలోనూ సెల్ఫ్ బౌండరీస్ కలిగి ఉండటం మంచిది. సమ్మతి(consent), అగ్రిమెంట్, రెస్పెక్ట్, ప్రయారిటీస్, కోరికలను అర్థం చేసుకోవడం, ప్రైవసీ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.
ఇంటెలెక్చువల్ టాకింగ్స్
ఇంటెలెక్చువల్ టాకింగ్స్ లేదా బౌండరీస్ అనేవి మీ ఆలోచనలను బట్టి ఉండేవి. ముఖ్యంగా ఇవి ఉత్సుకతను సూచిస్తాయి. మీ ఆలోచనలు, క్యూరియాసిటీ డౌన్ అయినప్పుడు లేదా తక్కువ చేయబడినప్పుడు అవి ఉల్లంఘించబడతాయి. గౌరవం, సంభాషణ, అర్థం చేసుకోవడానికి సుముఖత ఇక్కడ ముఖ్యమైనవి. అలాగే హెల్తీ ఇంటెలెక్చువల్ సరిహద్దులు.. అంటే.. ఒక విషయం గురించి మాట్లాడటానికి అది తమకు తగిన సందర్భమా కాదా? అని కూడా పరిగణించాలి. అలాగని మీరు అన్ని ఆలోచనలు, అభిప్రాయాలను అంగీకరించాలని దీని అర్థం కాదు. హెల్తీ అన్‌హెల్తీ డిస్కషన్స్ మధ్య విభేదాలను గుర్తించి మంచి మార్గంలో నడవడమే ఇంటెలెక్చువల్ టాకింగ్స్. సెల్ఫ్ బౌండరీస్‌లో ఇది చాలా ముఖ్యం.
Read More..