వాతావరణ మార్పులతో నష్టం.. గంటకు 16 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయంటున్న నిపుణులు

by Prasanna |   ( Updated:2023-10-10 07:37:10.0  )
వాతావరణ మార్పులతో నష్టం.. గంటకు 16 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: భూగోళంపై వాతావరణ మార్పుల వల్ల రెండు దశాబ్దాలుగా 1.2 బిలియన్ల మంది ప్రజలు క్లైమేట్ చేంజ్ క్రైసిస్‌కు గురయ్యారని యూఎస్‌కు పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల ప్రతీ గంటకు 16 మిలియన్ డాలర్ల అదనపు ఖర్చు అవుతోందని చెప్తున్నారు. వాస్తవానికి పర్యావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అనే పదాలు కొంతకాలంగా మనం తరచుగా వింటున్నాం. అయినా వాటిని పెద్దగా పట్టించుకోని వారే ఎక్కువ. రోజు రోజుకూ మారుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో మానవజాతికి పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతాలని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. ఇప్పటికే యూరప్ అంతటా ఉష్ణోగ్రతలు గతులు తప్పుతున్నాయి. ఇతర దేశాల్లో సందర్భం లేకుండా తుఫానులు, వరదలు రావడం, భూ కంపాలు సంభవించడం వంటివి పర్యావరణ సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. గార్డియన్ నివేదిక ప్రకారం గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం మధ్య ప్రతీ సంవత్సరం సగటున 140 బిలియన్ డాలర్లు ఖర్చు అయింది. ఇక 2022 సంవత్సరంలో అయితే 280 బిలియన్ డాలర్లు అయింది. చాలా దేశాల నుంచి, ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు సంబంధించిన డేటాను నిపుణులు ఇంకా విశ్లేషించలేదు. అలాగే క్లైమేట్ క్రైసిస్ కారణంగా పంట దిగుబడులు క్షీణించడం, సముద్ర మట్టాలు పెరుగడం కారణంగా వాతావరణ సంక్షోభాల వ్యయం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story