నాకేమైన అవుతుందా?.. అకాల మరణానికి దారితీస్తున్న అతి ఆందోళన.. రుగ్మతగా పేర్కొంటున్న నిపుణులు

by Dishafeatures2 |
నాకేమైన అవుతుందా?.. అకాల మరణానికి దారితీస్తున్న అతి ఆందోళన.. రుగ్మతగా పేర్కొంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : అతి ఆలోచనలు అనర్థదాయకమని చెప్తుంటారు. కానీ అతి ఆందోళన అంతకంటే ప్రమాదకరమని, ప్రాణాంతకంగా మారవచ్చునని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది తమకు ఎటువంటి సమస్య లేకపోయినా ఏదో ప్రాబ్లం వస్తుందేమోనని ముందుగానే భయపడుతుంటారు. తమ చుట్టుపక్కల వారు, బంధువులు ఇలా ఎవరు అనారోగ్యం బారిన పడినట్లు తెలిసినా.. తమకూ అలాగే జరిగి చనిపోతామేమోనని ఊహించుకుంటారు. దీనినే అతి ఆందోళనకు సంబంధించిన రుగ్మతగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కొందరిలో అకాల మరణానికి దారితీస్తోందని చెప్తున్నారు.

42 వేలమందిపై అధ్యయనం

ఇతరులతో పోల్చినప్పుడు తమకు ఏదో జరుగుతుందనే అతి ఆలోచన, ఆరోగ్యం గురించి అతిగా ఆందోళన చెందేవారు త్వరగా చనిపోతున్నట్లు స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా వారు సుమారు 42 వేల మందిని అబ్జర్వ్ చేశారు. వారి హెల్త్ డేటాను ట్రాక్ చేశారు. అతి ఆందోళనకు దారితీసే రుగ్మతను గుర్తించిన నిపుణులు దానికి ‘హైపోకాండ్రియాక్’ అని పేరు పెట్టారు. వాస్తవానికి ఇదొక తీవ్రమైన మానసిక జబ్బు. బాధిత వ్యక్తి తరచుగా ‘నా ఆరోగ్యం ఏమవుతుందో’ అని ఆందోళన చెందుతుంటారు.

ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్

హైపోకాండ్రియా గురించి ఇటీవల సోషల్ మీడియాలోనూ డిస్కషన్ నడుస్తోంది. అయితే దీనిని పలువురు నిపుణులు సిక్ యాంగ్జైటీ డిజార్డర్ అని, ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అని కూడా పిలుస్తు్న్నారు. ఈ రుగ్మతతో బాధపడేవారు తమకు హెల్త్ ప్రాబ్లం లేకపోయినప్పటికీ ఎక్కువగా ఊహించుకోవడంవల్ల నిజంగానే ఉందనే భ్రమలో కూరుకుపోతారు. ముందు జాగ్రత్తగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఏం ప్రాబ్లం లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. అందుకే బాధితుల్లో రుగ్మతను పోగొట్టే చికిత్స అవసరమని నిపుణులు అంటున్నారు.

ఆయుక్షీణతకు కారణాలు

సిక్ యాంగ్జైటీ లేదా హైపోకాండ్రియా బాధితును పరిశీలించినప్పుడు తమకు క్యాన్సర్ వస్తుందేమోనని తరచూ ఆందోళన చెందినవారు, ఈ విధమైన ఆందోళకు దూరంగా ఉన్నవారితో పోల్చినప్పుడు ముందుగానే చనిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. పైగా చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది ఆల్కహాల్, డ్రగ్స్, టొబాకో వంటి అలవాట్లు కలిగిన వారు కూడా ఉంటున్నట్లు కనుగొన్నారు. వీటి వినియోగం కూడా ఆయుక్షీణతలో కీలపాత్ర పోషిస్తుంది. కాబట్టి బాధితులను గుర్తించాకా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు కూడా కేర్ తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మానసిక రుగ్మతలకు సంబంధించిన మెరుగైన థెరపీలు అందుబాటులో ఉన్నాయి.

Next Story

Most Viewed