కర్రోడా అని పిలిచినందుకు విడాకులిచ్చిన భర్త.. అసలు కథేంటి అంటే..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-02 11:17:17.0  )
కర్రోడా అని పిలిచినందుకు విడాకులిచ్చిన భర్త.. అసలు కథేంటి అంటే..
X

దిశ, ఫీచర్స్: భార్యాభర్తల బంధాన్ని జన్మజన్మల బంధంగా అభివర్ణిస్తారు. ఒకరికొకరు అండగా నిలవాలని.. పరస్పరం గౌరవించుకోవాలని సూచిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ బంధాన్ని అలాగే కొనసాగించాలని అంటారు. కడదాకా తోడుంటే.. ప్రపంచంలోనే అత్యంత గొప్ప బంధంగా చెప్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కొద్దిగా అటు ఇటు అయినా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. గౌరవం మాట పక్కన పెట్టి నువ్వెంత అంటే నువ్వెంత అని సవాల్ విసుకురుకుంటున్నారు. తెగేదాక లాగుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. భర్తను కర్రోడా అని పిలిచినందుకు దెబ్బకు విడాకులిచ్చి పడేశాడు.

కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి తన భార్య తన కలర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయాడు. పదే పదే ఇలా జరుగుతుండటంతో కోర్టు మెట్లెక్కాడు. భార్య నుంచి విడాకులు కావాలని కోరాడు. దీనిపై విచారించిన కోర్టు భర్తను కర్రోడు అని పిలవడం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రూరత్వమని చెప్పింది. ఈ పద్ధతి మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుందని అభిప్రాయపడింది. భర్తకు కలిగే మానసిక వేదన నుంచి విడుదల చేస్తూ విడాకులు మంజూరు చేసింది.

Read More..

సూర్యాస్తమయంలో భార్య, భర్తల కలయిక వల్ల ఇన్ని అనర్ధాలా..!

Advertisement

Next Story

Most Viewed