జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !

by Disha Web Desk 8 |
జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !
X

దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ , దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏ సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఇక ఈయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే, అభిమానులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన సినిమా తీశాడంటే తప్పకుండా అందులో ఏదో ఒక మ్యాజిక్ తప్పనిసరిగా ఉండే ఉంటుంది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, జక్కన్న చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీరి ఫ్రెడ్షిప్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి తారక్ నా తమ్ముడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తారక్‌పై చూపించిన ప్రేమకు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.. వీరి మధ్య ఈ బంధం ఎప్పటికీ అలానే ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరు ఇండస్ట్రీలో ఎదిగే సమయంలో ఒకరికొకరు సహాయం అందించుకునేవారంట. అంతే కాకుండా వీరి కాంబినేషన్‌లో సింహాద్రి, స్టూడెంట్ నంబర్ వన్, త్రిబుల్ ఆర్ సినిమాలు వచ్చి అవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో మళ్లీ మీ కాంబో రిపీట్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో కోరుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్‌లో బిజీగా ఉండగా, రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read More..

చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత

Next Story

Most Viewed