మీకు నచ్చినట్టు డ్యాన్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-05-02 10:42:52.0  )
మీకు నచ్చినట్టు డ్యాన్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : డ్యాన్స్ అనేది ఓ కళ. డ్యాన్స్ చేయడంలో ఒకొక్కరి స్టైల్ ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మంది క్లాసికల్ డ్యాన్స్ చేస్తే, ఇంకొందరు మాస్ డ్యాన్స్ చేస్తారు. కానీ కొందరు మాత్రం తమకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసి ఎంజాయ్ చేస్తారు. అయితే డ్యాన్స్ ఎలా చేసినా మంచిదే కానీ.. తప్పకుండా డ్యాన్స్ చేయాలంట. మీకు నచ్చినట్టు డ్యాన్స్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్యాన్స్ చేయడం వలన మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. రోజులో ఒక్కసారైనా డ్యాన్స్ చేయడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బులు రాకుండా ఉంటాయంట. అంతేకాకుండా , ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతి రోజు కొద్ది సేపు డ్యాన్స్ చేయడం వలన బరువు తగ్గుతారంట. కొంతమంది ఒంటరితనంతో బాధపడిపోతుంటారు. అలాంటి వారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం వలన మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతే కాకుండా వేరే వారితో కలిసి డ్యాన్స్ చేయడం వలన సామాజిక సంబంధాలు పెరిగి, స్నేహ భావం పెపొందుతుందంట. అలాగే డ్యాన్స్ కండరాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా డ్యాన్స్ క్రమం తప్పకుండా చేయడం వలన .. మానసిక స్థితిని మెరుగు పరిచి, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. శారీరక శ్రమ, లయబద్ధమైన కదలిక, సంగీతం కలయిక మనసుకు మంచిది. దీని వలన ఎండార్ఫిన్లను విడుదలవుతాయి. ఇది ఆందోళన, నిరాశ భావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువలన మీకు డ్యాన్స్ రాదు అని భయపడకుండా, మీకు నచ్చినట్టు రోజులో ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలి అంటున్నారు నిపుణులు.

Read More..

ధూమపానం రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణమవుతుందా ?

Advertisement

Next Story