- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న వయసులో జుట్టు నెరిసిందా.. ఈ నూనెను ట్రై చేసి చూడండి..
దిశ, ఫీచర్స్ : నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా ఉండే జట్టును ఎవరు కోరుకోరు చెప్పండి. అందమైన జట్టు మన రూపాన్ని అందంగా మార్చడంలో ముందంజలో ఉంటుంది. జుట్టు రాలడం లేదా పొడిగా కనిపించడం సర్వసాధారణం. కానీ అది అకాలంగా తెల్లజుట్టు రావడానికి కూడా కారణం అవుతుంది. ఒక్కసారి తెల్లజుట్టు వచ్చిందంటే చాలు మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, సరైన ఆహారం, జుట్టు సంరక్షణ లేకపోవడం వంటి అనేక కారణాల ద్వారా జుట్టు రంగు నెరిసిపోతుంది. అయితే వెంట్రుకలను మళ్లీ నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డై, ఇతర కెమికల్ కలిసిన రంగులు వేసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు నల్లగా ఉన్నప్పటికీ మళ్లీ తెలుపు రంగులోకి మారిపోతాయి.
అలా కాకుండా జుట్టును నల్లగా చేసుకోవాలనుకుంటే ఆయుర్వేదంలోని కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దానికోసం గ్రీన్ లీఫ్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల గ్రే హెయిర్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని చెబుతున్నారు.
జుట్టు నల్లగా ఉంచడంలో మెలనిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతే జుట్టు దాని సహజ రంగును కోల్పోతుంది. దాంతో నల్లని జుట్టు కూడా తెల్లగా మారుతుంది. అయితే సహజంగా జుట్టు నల్లగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది విటమిన్ B9, సింథటిక్ రూపం అని చెబుతారు. ఇది సప్లిమెంట్ల ద్వారా తీసుకోవచ్చు. పాలకూర, ఆవపిండి వంటి ఆకుపచ్చ కూరగాయల ద్వారా దీన్ని తీసుకోవచ్చు.
అలాగే కరివేపాకు ద్వారా జుట్టును నల్లగా మార్చే ఓ టిప్ ని ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక ఇనుప పాత్రలో కొబ్బరి నూనె తీసుకుని, అందులో ఎండు ఉసిరి, నల్ల నువ్వులు, కరివేపాకు వేయాలి. మీకు కావాలంటే మీరు దీనికి టీ ఆకులను కూడా జోడించవచ్చు. ముందుగా గ్యాస్ స్టవ్ మీద పాత్రను పెట్టి అందులో కొబ్బరి నూనెను వేడి చేయాలి. అది గోరువెచ్చగా అయ్యాక అందులో కరివేపాకు, ఎండు ఉసిరి, నల్ల నువ్వులు వేసి వేడి చేయాలి. వడగట్టిన తర్వాత చల్లారాక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఆ తర్వాత నూనెను ఒక వారం పాటు సూర్యరశ్మిలో ఉంచండి. ఆ తర్వాత మాత్రమే అదిరాసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఈ నూనెను వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనెను రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభించడంతో పాటు సహజసిద్ధంగా నలుపు రంగులోకి వస్తుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి..
మీ జుట్టు సహజంగా నల్లగా ఉండటానికి, మీ ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కావాలంటే ఉసిరికాయ, నల్ల నువ్వులు, గోధుమ గడ్డి రసం, క్యారెట్ రసాన్ని సేవిస్తే మీ జుట్టు నిగనిగలాడుతుంది. అలాగే మృదువుగా మారుతుంది.
రోజూ ఉసిరికాయ రసం తాగడం వల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, ఇతర అంశాలు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.
జుట్టు నల్లగా ఉండాలంటే పాలకూర తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.