ప్రపంచంలోనే ట్రీట్మెంట్‌ లేని వ్యాధి.. అది కూడా మహిళలకే వస్తుంది !

by Javid Pasha |
ప్రపంచంలోనే ట్రీట్మెంట్‌ లేని వ్యాధి.. అది కూడా మహిళలకే వస్తుంది !
X

దిశ, ఫీచర్స్ : పరిష్కారంలేని సమస్యలు ఉండకపోవచ్చునేమో కానీ, చికిత్సలేని వ్యాధులు అరుదుగానైనా కొన్ని ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటివాటిలో ఎండోమెట్రియాసిస్ ఒకటి. ఇది కేవలం మహిళలకు మాత్రమే వచ్చేవ్యాధి. వరల్డ్ పాపులేషన్‌‌లో దాదాపు 10 శాతం మంది స్త్రీలు దీనిబారిన పడుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని ప్రధాన లక్షణం ఏంటంటే.. పీరియడ్ టైంలో బాధిత స్త్రీలకు, మిగతా స్త్రీలకంటే భిన్నంగా భయంకరమైన నొప్పి కలుగుతుంది.

ముందుగా కటి భాగంలో నొప్పి మొదలవుతుంది. నెలసరి క్రమరహితంగా రావడంతోపాటు రక్తస్రావం అధికం అవుతుంది. అయితే ఇది జస్ట్ నెలసరి సమయంలోనే వచ్చిపోయే సమస్యగా ఉంటున్నప్పటికీ, ఈ వ్యాధితో ఇబ్బందిపడే మహిళల్లో క్రమంగా ఇతర అవయవాలకు కూడా నొప్పి పాకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్లమందికిపైగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా వక్షోజాల్లో నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి కలగడం ఎండోమెట్రియాసిస్ వ్యాధి లక్షణాల్లో భాగమే. నెలసరి నొప్పికి తాత్కాలికంగా పెయిన్ కిల్లర్ వంటి మెడిసిన్స్ ఉన్నప్పటికీ ఈ వ్యాధిని శాశ్వతంగా తగ్గించే సరైన చికిత్స ఏదీ లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story