- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోజూ ఖర్జూరం తినడం వల్ల ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్: ఖర్జూరాలు మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మనకి మార్కెట్లో నిత్యం దొరుకుతూనే ఉంటాయి. అనేక రకాల ఖర్జూరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఇంకా మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్లు B6, K పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి . ఖర్జూరం తినడం వల్ల శరీరానికి ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు అందుతాయి.
ఖర్జూరం జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కూడా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం కూడా ఖర్జూరాలకు ఉంది.
ఖర్జూరంలో చక్కెర ఉన్నప్పటికీ, అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా చేయగలవు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఖర్జూరాలు మెదడు ఆరోగ్యం, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.