- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తున్న అధిక బరువు
దిశ, ఫీచర్స్ : అధిక బరువు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని తెలిసిందే. అయితే అదనంగా ఇది పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ పెరుగుదలకు 13 శాతం కారణం అవుతుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 17 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఊబకాయం కలిగిన 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఏటా 2, 50, 000 మంది ఉంటున్నారని స్వీడన్ దేశానికి చెందిన ఒక కొత్త డేటా పేర్కొంటున్నది. దీనవల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదంతోపాటు 27 శాతం అకాల మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది. అనారోగ్య కరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్స్, హై కొలెస్ర్టాల్ కలిగిన పదార్థాలు, స్వీటెనర్స్, శారీరక శ్రమ లేకపోవడం, అర్బనైజేషన్ వల్ల కలుషితం అవుతున్న వాతావరణ పరిస్థితులు అధిక బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి.
ఒబేసిటీ లేదా అధిక బరువు ప్రమాదాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వర్గీకరించింది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపర్లిపిడెమియా, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్, అబ్ స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా వెరికోస్ వీన్స్, లివర్ డిసీజెస్, క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయని తెలిపింది. అయితే అధిక క్యాన్సర్‌కు ఎలా కారణం అవుతుందో క్లారిటీగా తెలియనప్పటికీ అన్ని క్యాన్సర్లలో 4 నుంచి 8 శాతం ఊబకాయంవల్ల సంభవిస్తున్నాయని హెల్త్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. వీటితోపాటు ఊబకాయంవల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, లో కాన్ఫిడెంట్, సెక్సువల్ డిజార్డర్స్ వంటి ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి.
పరిష్కారమేంటి?
ఆరోగ్య కరమైన జీవన శైలిని అలవర్చుకోవడం, ప్రాసెస్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయడం, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, కేలరీలను బర్న్ చేసేలా తరచూ వ్యాయామం, శారీరక శ్రమ కలిగి ఉండటం వంటి చర్యలతో అధిక బరువు లేదా ఒబేసిటీ సమస్యలను నివారించవచ్చు. ఇక జన్యుపరమైన ఒబేసిటీ సమస్యలను పూర్తిగా నివారించడం కొంచెం కష్టమైనప్పటికీ తరచూ వ్యాయామం, ఆహార నియమాలతో కంట్రోల్ చేయవచ్చు. దానివల్ల సంభవించే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.
Read More... ‘మార్నింగ్ ఫెటీగ్’ వేధిస్తోందా? .. అయితే ఇలా చేయండి!