Drinking water : కాచి చల్లార్చిన నీళ్లు.. ఫిల్టర్ వాటర్.. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏవి మంచిది?

by Javid Pasha |
Drinking water : కాచి చల్లార్చిన నీళ్లు.. ఫిల్టర్ వాటర్.. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏవి మంచిది?
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు కూడా తాగాలి. అప్పుడే బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకూ 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కాగా సీజన్‌ను బట్టి, పిల్లలు, పెద్దల వయస్సును బట్టి తీసుకునే వాటర్ కంటెంట్‌లో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అయితే హెల్తీగా ఉండాలంటే ఏ నీళ్లు మంచిది? కాచి చల్లార్చిన నీళ్లా?, ఫిల్టర్ వాటరా? ముఖ్యంగా వర్షాకాలంలో ఏవి తాగాలి? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

కాచి చల్లార్చిన నీళ్లు

వర్షాకాలంలో వేడి నీళ్లు.. అంటే కాచి చల్లార్చిన వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వాటిని వేడిచేసినప్పుడు అందులో ఉండే రోగకారక బ్యాక్టీరియాలు, వైరస్‌లు, హానికారక సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇక వర్షా కాలంలో తరచుగా వానలు కురువడం కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతంటాయి. మిగతా సీజన్లతో పోలిస్తే నీటి కాలుష్యానికి అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ సీజన్‌లో తప్పక వేడి చేసిన చల్లార్చిన నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే వేడిచేయడంవల్ల కొన్ని రకాల హెవీ మెటల్స్, కెమికల్ పొల్యూషన్, పెప్టిసైడ్స్ కారకాలు వంటివి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉండకపోవచ్చు. దీంతోపాటు నీటిని మరిగించడం కారణంగా రుచి, వాసన మారుతాయి. దీంతో ఆ నీళ్లను తాగాలనిపించదు. కాబట్టి ఎల్లప్పుడూ వేడినీటిని తాగడానికి కొందరు ఇష్టపడరు.

ఫిల్టర్ వాటర్

ఫిల్టర్ వాటర్ విషయానికి వస్తే ప్రస్తుతం చాలామంది ఈ వాటర్‌ తాగుతున్నారు. వేడిచేసి చల్లార్చిన నీటికంటే ఫిల్టర్ వాటర్ సురక్షితమని కూడా చెప్తుంటారు. ఎందుకంటే హెవీ మెటల్స్, కెమికల్స్, క్లోరిన్ వంటివి డేంజరస్ మూలకాలను తొలగించడంలో ఫిల్టర్లు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఫిల్టర్ వాటర్ కూడా మంచిదని నిపుణులు చెప్తుంటారు. ఇక వేడి నీళ్లు, ఫిల్టర్ వాటర్‌లలో ఏవి మంచిదంటే.. స్వల్ప తేడా మినహా రెండూ మంచివే అంటున్నారు నిపుణులు. మరిగించడంవల్ల వేడినీటిలో రుచి తగ్గుతుంది. ఫిల్టర్ వాటర్‌లో అయితే తగ్గదు. కాబట్టి చాలామంది ఫిల్టర్ వాటర్ తాగడానికి ఇష్టపడుతుంటారు. మొత్తానికి కాచి చల్లార్చిన నీరైనా, ఫిల్టర్ వాటర్ అయినా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed