- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా
దిశ, ఫీచర్స్ : చిన్నపిల్లలకు తల్లిపాల కన్నా శ్రేష్ఠం ఇంకోటి ఉండవు. అయితే కొంతమంది తల్లులకు పాలు సరిగ్గా రాకపోవడంతో వారు బయట పాలను ప్లాస్టిక్ డబ్బాలో పోసి పట్టిస్తూ ఉంటారు. మరికొంత మంది పాలు ఉన్న వారి బిజీ షెడ్యూల్ కారణంగా బాటిల్ పాలనే ఫీడ్ చేస్తూ ఉంటారు. విదేశాల్లోనే కాదు ఈ సంస్కృతి భారతదేశంలో కూడా ఉంది. ఇలా ప్లాస్టిక్ డబ్బాతో పాలను ఫీడ్ చేయడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంతకీ పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తాగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాస్టిక్ బాటిళ్లు కడగడం..
ప్లాస్టిక్ బాటిళ్లను కడిగేందుకు వేడి నీళ్లను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ బాళ్లలో వేడినీళ్లు వేస్తే అందులో నుంచి కొన్ని ప్లాస్టిక్ రేణువులు విడుదలయి అవి పాలతో పాటు కడుపులోకి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల పిల్లల పొట్ట, మెదడు కూడా దెబ్బతింటుందని ఇటీవలి పరిశోధనలో తేలిందని నిపుణులు చెబుతున్నారు.
రసాయనాల విడుదల..
కొన్ని ప్లాస్టిక్‌లు BPA, phthalates వంటి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వేడి పదార్థాలు పోసినప్పుడు ఇవి రిలీస్ అవుతాయి. ఈ మూలకాలు పిల్లల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. శిశువులలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అంతే కాకుండా ప్లాస్టిక్ సీసాలు పర్యావరణానికి హానికరం. వాటికి దూరంగా ఉండటం ద్వారా మీరు మీ పిల్లలతో పాటు పర్యావరణాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.
రుచి, వాసన..
కొన్నిసార్లు ప్లాస్టిక్ బాటిళ్లోని పాలు రుచి, వాసనను ప్రభావితం చేస్తుంది. శిశువునకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్లాస్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ మంచి ఎంపికలు. ఇవి పాల నాణ్యత పై ఎలాంటి ప్రభావం చూపించదు. ప్లాస్టిక్ సీసాల వల్ల కలిగే హానిని నివారించడానికి, గాజు లేదా అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించండి. ఇవి సురక్షితమైనవి, పర్యావరణ అనుకూలమైనవి, మీరు వాటిని ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. అవి ఎటువంటి హానికరమైన రసాయనాలను విడుదల చేయవు.
ఏం చేయాలి..
దీన్ని నివారించడానికి ప్లాస్టిక్ బాటిళ్లను కడిగేటప్పుడు వేడి చేయవద్దని వైద్యులు సూచించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, ప్లాస్టిక్‌కు బదులుగా గాజు, స్టీల్ బాటిళ్లను పిల్లలకు ఉపయోగించాలి. పిల్లలకు తల్లి పాలు లేదా ఫార్ములా పాలు ఇవ్వడానికి మీరు ప్లాస్టిక్ బాటిళ్లను ఎప్పుడు వేడి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : మీరు ఇప్పటి వరకు మీ పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్‌లో పాలు పోస్తూ ఉంటే, అది మీ బిడ్డకు హాని కలిగిస్తుంది కాబట్టి మీరు అలా చేయడం మానేయాలి.