గాజు గ్లాసులో మద్యం తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Anjali |
గాజు గ్లాసులో మద్యం తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
X

దిశ, ఫీచర్స్: మద్యం తాగేటప్పుడు చాలా మంది ట్రాన్స్‌ఫరెంట్ గ్లాసులను ఉపయోగిస్తారు. లేకపోతే పారదర్శకంగా ఉండే డిస్పోజబుల్ గ్లాసులను వాడుతారు. కానీ స్టీల్ గ్లాసులు, కలర్ గ్లాసులు మాత్రం ఉపయోగించరు. కాగా మద్యం సేవించేటప్పుడు పారదర్శకమైన గ్లాసులే వినియోగించడానికి గల కారణాలేంటో తాజాగా నిపుణులు వెల్లడించిన తీరును ఇప్పుడు చూద్దాం..

గాజులతో తయారు చేసిన ఏ వస్తువులైనా చూడడానికి హుందాగా కనిపిస్తాయి. వీటిలో వేసిన ఫుడ్ అయినా, కూల్ డ్రింక్స్ అయినా చూస్తే నోరూరుతుంది. కాగా గాజు గ్లాసులో మందు తాగితే ఏమాత్రం కలుషితం చేయదు. రుచి, వాసనను మార్చదు. అలాగూ నోరూరించేలా మందును బయటికి క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పుడు మద్యం ప్రియులకు దాన్ని తాగాలన్న కోరిక మరింత పెరుగుతుంది.

మందులో ఏమైనా కలుషితాలు, వ్యర్ధాలు ఉంటే గాజు గ్లాసులో నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి త్వరగా బ్యాక్టీరియాలకు చోటు ఇవ్వదు. అందులో వేసిన ఆహారాలు కాలుష్యం కాకుండా కాపాడుతుంది. అంతేకాదు గాజు ఇతర ఉత్పత్తులతో పోలిస్తే రియాక్షన్ లక్షణాన్ని తక్కువగా చూపిస్తుంది. అంటే గాజు గ్లాసు లేదా గాజు ప్లేటులో ఏవైనా ఆహారాలను వేస్తే ఆ పదార్థాలతో రసాయన సంబంధాలను కలిగి ఉండదు.

దీనివల్ల వాటి రుచి, వాసన మారవు. వేరే ఇతర గ్లాసులైతే ఆహారంతో రసాయన సంబంధాన్ని పెట్టుకునే చాన్స్ ఉంటుంది. ఈ కారణంగా టేస్ట్ చేంజ్ అవ్వొచ్చు. అంతేకాకుండా మందు త్వరగా గది ఉష్ణోగ్రత వద్దకు రాదు. రూంలోని ఉష్ణోగ్రత మార్పులను గాజు గ్లాసుకు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అందుకే పూర్వం నుంచి గాజు గ్లాసుల్లోనే మందు తాగుతారని నిపుణులు చెబుతున్నారు. గాజు గ్లాసులో తాగడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed