- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఈ విషయాలు పంచుకుంటున్నారా? బీ కేర్ ఫుల్..!!
దిశ, ఫీచర్స్: బాధలో అయినా.. సంతోషంలో అయినా.. డబ్బున్నా.. లేకున్నా.. ఎవరున్నా.. లేకున్నా.. నీకు నేనున్నా నేస్తం అని ఏ సమయంలోనైనా నీ తోడుండే వాళ్లే నిజమైన స్నేహితులు. దాదాపు ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్ లైఫ్ లో, కాలేజ్ లైఫ్ లో, కోచింగ్ సెంటర్లలో.. ఇలా ఎక్కడెక్కడో అనుకోకుండా నార్మల్ ఫ్రెండ్స్ గా పరిచయమై, వారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. అయితే చాలా మంది ఎలాంటి బాధ వచ్చినా.. తమ తల్లిదండ్రుకన్నా ముందు ప్రాణ స్నేహితులతోనే చెప్పుకుంటారు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కు కూడా చెప్పుకోకూడని విషయాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
భాగస్వామి గతం గురించి..
బెస్ట్ ఫ్రెండ్స్స్ కి చెబితే ఎవరికీ చెప్పరనే నమ్మకంతో చాలా మంది పర్సనల్ విషయాలను పంచుకుంటారు. వారి ప్రేమ గురించి.. పెళ్లయ్యాక భర్త గురించి కూడా తమ స్నేహితులకు చెబుతుంటారు. అయితే ముఖ్యంగా మీ భాగస్వామి గతం గురించి ఫ్రెండ్స్ తో అస్సలు పంచుకోవద్దంటున్నారు నిపుణులు. వారికి చెప్పినట్లు మీ భర్తకు తెలిస్తే మీ రిలేషన్ దెబ్బతింటుందని, అది కాస్త డివోర్స్ వరకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన పర్సనల్ పి క్స్ పంపడం...
మీ స్నేహితులు మీతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ పొరపాటున కూడా బాయ్ ఫ్రెండ్ తో దిగిన వ్యక్తిగత ఫొటోలు పంపవద్దు. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. కాగా వీలైనంత వరకు మీ ఫొటోలను సీక్రెట్ గానే ఉంచుకోండి. ఒకవేళ పంపినట్లైతే.. అవి ఎన్నో దారుణాలకు ఒడిగడుతాయి. కాగా బాయ్ ఫ్రెండ్ తో దిగిన పర్సనల్ పిక్స్ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు.
ఆస్తిపాస్తుల వివరాలు పంచుకోవడం..
చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ తమ ఇంట్లో ఏం జరిగినా, ప్రతి ఒక్క చిన్న విషయం తమ ఫ్రెండ్స్ తో పంచుకుంటుంటారు. వారి ఫ్యామిలీ విషయాల నుంచి ఆస్తిపాస్తుల విషయాల వరకు చెప్పుకుంటారు. కానీ ఆస్తుల గురించి కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ కే కాదు.. మీ చుట్టాలకు కూడా చెప్పుకొవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు. మీ స్నేహంలో పలు మనస్పర్థలు చోటుచేసుకుంటే మీ విషయాలు ఇతరులకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంతటి ప్రాణ స్నేహితులకైనా కొన్ని విషయాలు పంచుకోకపోవడమే బెటర్ అంటున్నారు.
Read More..
ప్రేమ కోసం 8వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన మహిళ.. ఆపై ఏం జరిగిందంటే ?