జీవితంలో రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు ఇవే..

by Sujitha Rachapalli |
జీవితంలో రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్: మన పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకూడదని చెప్తుంటారు నిపుణులు. అలాగని పూర్తిగా మేజర్ ఈవెంట్స్ కూడా పంచుకోకూడదని కాదు కానీ ప్రతి చిన్న విషయం అవసరం లేదంటున్నారు. ఇలా ప్రతిదీ షేర్ చేసుకుంటూ పోతే.. మీకే ముప్పు కలిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ కొన్ని సందర్భాల్లో మీకు వ్యతిరేకంగా పని చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మీరు ఎంత ఎక్కువ మీ జీవితంలో జరిగే విషయాల గురించి ఇతరులతో పంచుకుంటే.. అంతగా మిమ్మల్ని జడ్జ్ చేస్తారని, తక్కువగా చూస్తారని చెప్తున్నారు. ఇంతకీ ఎలాంటి విషయాల్లో సీక్రెట్ మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం.

జీవిత లక్ష్యం

లైఫ్ లో మీకున్న గోల్స్ గురించి ఎవరికీ చెప్పకండి. దీని గురించి పదేపదే మాట్లాడిన ఇలాగే చెప్తారని అలుసుగా తీసుకుంటారు. నువ్వేం చేస్తావులే అన్నట్లుగా డెమోటివేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీ బాగు కోసం ఆలోచించాలని లేదు. నీ పతనం కోరుకునేవారు కూడా ఉంటారని మరిచిపోవద్దు.

సంపాదన

మీ సంపాదన గురించి టాపిక్ వచ్చినప్పుడు దీనిపై చర్చించేందుకు నో చెప్పడమే మంచిది. ఎందుకంటే డబ్బు.. ఈర్ష్య ద్వేషాలు, పోలికకు దారితీస్తుంది. మీకు నెలకు ఎంత జీతం వస్తుందో తెలిసినప్పుడు జనాలు మీరు ఎలా ఉంటే బాగుంటుందో నిర్ణయిస్తారు. అంత పైసా ఉన్నప్పుడు అలా ఎందుకు ఉండకూడదు.. తక్కువ మనీ ఉన్నప్పుడు అంతలోనే బతకొచ్చు కదా లాంటి డైలాగ్స్ వేస్తారు. ఇలాంటి మాటలు మీకు అసౌకర్యం కలిగిస్తాయి. వారి ఎక్స్ పెక్టేషన్స్ లో జీవించాలనే ఆలోచనను పుట్టిస్తాయి. మొత్తానికి మానసికంగా ప్రభావితం చేస్తాయి. అలా కాకుండా మీ సంపాదన ఎంతో ప్రైవేట్ గా ఉంచినప్పుడు రిలేషన్స్ బాగుంటాయి అని సూచిస్తున్నారు నిపుణులు.

కుటుంబ పరిస్థితులు

ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. కొందరికి సింపుల్ లైఫ్ ఉండొచ్చు. ఇంకొందరికి పర్సనల్లి పెయిన్ ఫుల్ లైఫ్ అనుభవించవచ్చు. ఇలాంటి విషయాలు ఇతరులతో షేర్ చేసుకుంటే సమస్యలు మరింత పెద్దగా కావచ్చు. న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు. మనం షేర్ చేసుకున్న పర్సన్ మనకు హెల్ప్ చేయలేని పరిస్థితిలో అసౌకర్యానికి గురికావచ్చు. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివి పంచుకోకపోవడమే మంచిది.

వ్యక్తిగత నమ్మకాలు

అందరికీ వ్యక్తిగత నమ్మకాలు ఉంటాయి. మత పరమైనవి కావచ్చు. రాజకీయం అయ్యుండొచ్చు. ఫుడ్ ప్రిఫరెన్స్ కావచ్చు. ఇవి మన అనుభవాలు, అభిరుచుల నుంచి పుట్టుకొస్తాయి. వీటి గురించి మాట్లాడినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరగొచ్చు. పరిస్థితి తీవ్రమైతే గొడవలకు దారితీయవచ్చు. మిమ్మల్ని విమర్శించవచ్చు. అసహ్యించుకోవచ్చు. అందుకే ఇలాంటివి పంచుకోవద్దు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

సెల్ఫ్ కేర్

మీ సెల్ఫ్ కేర్ మీ ఇష్టం. మీకు కంఫర్ట్ గా ఉంటుంది. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. కానీ మీరు మీ సెల్ఫ్ కేర్ రొటీన్ గురించి పంచుకుంటే అనవసరంగా జడ్జ్ చేయబడుతారు. అలా చేస్తారా? ఇలా చేయకూడదు? అంటూ లేని పోని సలహాలు, విమర్శలు వస్తుంటాయి. మీ మీద అనుకోని ఒత్తిడి పెరుగుతుంది. చివరికి మీ ఇష్టానికి వ్యతిరేకంగా పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది.

రిలేషన్ షిప్ ఇష్యూస్

జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతీ బంధం ఎప్పటికీ అంతే అందంగా ఉండాలని లేదు. కొన్ని కొంతవరకే సాగొచ్చు. మధ్యలోనే బ్రేక్ కావచ్చు. ఇలాంటి రిలేషన్ షిప్స్ గురించి నమ్మకమైన స్నేహితులు, థెరపిస్టులతో మాత్రమే పంచుకోవాలి. అది కూడా లోతుగా అవసరం లేదంటున్నారు నిపుణులు. అందరికీ షేర్ చేస్తే నవ్వులపాలు అయ్యేది మీరు మాత్రమే అని హెచ్చరిస్తున్నారు. ఇదంతా కాకుండా మీ పార్టనర్ తో మాట్లాడి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుని, గౌరవంగా ఉండటం మంచిది అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed