- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కుక్క దరఖాస్తు.. కంగుతిన్న అధికారులు!
దిశ, డైనమిక్ బ్యూరో: కుక్కల్లో జాతులు(బ్రీడ్) ఉంటాయని తెలుసు కానీ, కులం ఉంటుందా? అంటే ఉంటుందనే తెలుస్తోంది తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ చూస్తుంటే. కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ ఓ కుక్క దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదండోయ్ ఆ కుక్క చదువుకుంటుందట. దానికి తల్లిదండ్రులు కూడా ఉన్నారని, తనకు ఆధార్ కార్డు కూడా ఉందని ఆ ప్రూఫ్ ఆధారంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కుక్క దరఖాస్తు చేసుకోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ విచిత్రమైన ఘటన బిహార్‌లోని గయా పట్టణంలో చోటుచేసుకుంది. అయితే, బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనవరి 7 నుంచి జనవరి 21 వరకు చేసిన సర్వేలో అధికారులు దరఖాస్తులను పరిశీలించారు.
వీటిలో ఒక కుక్కకు సంబంధించిన దరఖాస్తు ఒకటి అధికారులను విస్మయానికి గురిచేసింది. టామీ అనే పేరుతో వచ్చిన దరఖాస్తులో పుట్టిన తేదీ 14 ఏప్రిల్ 2022 అని.. పందేపోఖర్ గ్రామం, రౌనా పంచాయితీ, 13వ వార్డు, గురారు సర్కిల్, కొంచ్ పోలీస్‌స్టేషన్ అని ఆధార్‌కార్డు మీద చిరునామా ఉంది. ఆధార్ నంబర్‌తో పాటు 'ఆధార్ –ఆమ్ కుత్తా కా అధికార్' అని రాసి ఉంది. అంతేకాదు తన తల్లిదండ్రుల పేరు షేరు, గిన్నీ అని, ఇక తానొక స్టూడెంట్ అని దరఖాస్తులో పేర్కొని ఉంది. అయితే ఆధార్ కార్డుని రికార్డుల్లో పరిశీలించగా రాజబాబు అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు కావాలని చేసిన పని అని గుర్తించారు. ఇలా తమ సమయాన్ని వృధా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Also Read :-
1.నాకెప్పుడూ అలాంటి క్యారెక్టర్లే ఇచ్చేవాడు: డైరెక్టర్‌పై టబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
2.జుపిటర్ గ్రహం చుట్టూ మరో 12 ఉపగ్రహాలు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి