- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Green Tea: గ్రీన్ టీ.. నిజంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుందా?
దిశ, ఫీచర్స్ : ప్రతీరోజు కొన్ని కప్పుల గ్రీన్ టీ(Green Tea) తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అందులో కొంతవరకు నిజమున్నా.. బాడీ ఫ్యాట్ కరిగించుకునేందుకు కేవలం ఈ పానీయం మీదనే ఆధారపడితే మాత్రం బరువు తగ్గే విషయంలో నిరాశ చెందక తప్పదు. నిజానికి యాంటీఆక్సిడెంట్స్(Antioxidant) సమృద్ధిగా లభించే గ్రీన్ టీ.. చర్మ సంబంధ సమస్యల నివారణతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరి బెల్లీ ఫ్యాట్(Belly Fat) తగ్గించడంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇటీవలి కాలంలో 'గ్రీన్ టీ' పట్ల మీడియా ప్రకటనల్లోనూ పాజిటివిటీ క్రియేట్ అయింది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ సహా యాంటీఆక్సిడెంట్ల వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. అయితే, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో గ్రీన్ టీ సాయపడుతుందని నిరూపించే పరిశోధనలు లేవు. నిజానికి ఆహారంగా ఏదైనా నిర్దిష్ట వస్తువును తీసుకోవడం లేదా తొలగించడం వల్ల కొవ్వు తగ్గదు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం జీవనశైలి, వారు తీసుకునే కేలరీల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఇక సాధారణ టీకి ప్రత్యామ్నాయంగా.. అంటే పాలు, చక్కెర వంటి క్యాలరీస్(Calories) లేకుండా తీసుకోవడం వల్ల గ్రీన్ టీ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే బరువు తగ్గేందుకు గ్రీన్ టీ నేరుగా సహాయం చేయదని నిపుణులు చెప్తున్నారు.
ఇది సూక్ష్మంగా, చాలా తక్కువ పరిమాణంలో జీవక్రియను పెంచుతుంది. కాగా బరువు తగ్గాలంటే కేలరీలను తగ్గించడమే కాదు తీసుకునే ఆహార నాణ్యతను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. నిజానికి పండ్లు, సలాడ్లు, కూరగాయల నుంచి విటమిన్లు, మినరల్స్ పొందుతారు. నీటితో పాటు ఈ పోషకాలన్నీ కిడ్నీ, కాలేయాన్ని డిటాక్సిఫై(Detoxify) చేయడంలో తోడ్పడతాయి. దీంతో ఆటోమేటిక్‌గా జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గే వీలుంటుంది. హెల్తీ ఫుడ్, కేలరీల సమతుల్యత కాపాడుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, సరైన నిద్ర వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. అయితే గ్రీన్ టీని కూడా కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదే.
- Tags
- green tea