Depression : ప్రెగ్నెన్సీలో డిప్రెషన్..! పుట్టుబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందా?

by Javid Pasha |   ( Updated:2024-11-03 10:52:27.0  )
Depression : ప్రెగ్నెన్సీలో డిప్రెషన్..! పుట్టుబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందా?
X

దిశ, ఫీచర్స్ : గర్భధారణ సమయంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలు పుట్టుబోయే పిల్లలపై ప్రభావం చూపుతుంటాయని పెద్దలు చెప్తుంటారు. అన్నీ అలా జరగవు కానీ కొన్ని మాత్రమే జరిగే అవకాశం ఉందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నివేదిక పేర్కొంటున్నది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో డిప్రెషన్‌కు గురైతే ఆ ప్రభావం పిల్లలపై కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లల నిద్ర అలవాట్లపై ఆ ప్రభావం పడుతుందని, పదేండ్ల వయస్సు తర్వాత వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారని అధ్యయనంలో వెల్లడైంది. శాస్త్రవేత్తల ప్రకారం ఏయే మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

*ఒక ఆడ శిశువుకు పుట్టుకతోనే తన తల్లి నుంచి అనేక లక్షణాలు సంక్రమిస్తాయని, ఇందులో మేధస్సు కూడా ఒకటని నిణులు చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లిలో డిప్రెషన్ కారణంగా మైటో కాండ్రియా కూడా ప్రభావితం అవుతుంది. ఇందులో ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. వీటిని తల్లి నుంచి పుట్టబోయే కుమార్తె కూడా పొందుతుంది. కాబట్టి ఇవి మేధస్సు స్థాయిని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

*అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం.. గర్భధారణ సమయంలో కుటుంబంతో ఉండటంవల్ల స్త్రీకి హెల్త్ ప్రాబ్లమ్స్ గణనీయంగా తగ్గుతాయి. ఇక ఆ సమయంలో డిప్రెషన్‌తో బాధపడే మహిళలకు జన్మించే పిల్లలు తర్వాత కాలంలో ఉన్నత చదువులు చదివే అవకాశం కూడా అని నిపుణులు గుర్తించారు. కారణం వారిలో మానసిక ఆరోగ్య పరిస్థితి అందుకు సహకరించకపోవచ్చు.

*నివేదికల ప్రకారం గర్భధారణ సమయంలో డిప్రెషన్ ఎదుర్కొంటున్న మహిళల పిల్లల్లో 20 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను పొందగలుగుతున్నారు. ఇక 85 శాతం ప్రెగ్నెన్సీలో తమ కుటుంబంతో ఉన్నప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటారు. దీంతో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో హ్యాపీగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవాలని, కుటుంబం అందుకు సహకరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


👉Also Read: ఈ తెల్లటి పదార్థాలు తింటున్నారా..! తర్వాత జరిగేది ఇదే..


Advertisement

Next Story

Most Viewed