- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లి ఎప్పుడని పదే పదే మీ బంధువులు విసిగిస్తున్నారా? ఇలా సమాధానం చెప్పండి!
దిశ, ఫీచర్స్: ఓ వయసు రాగానే ఎక్కువగా వినిపించే మాట పెళ్లి. మన ఇంట్లో వారి కంటే ముందుగా బంధువులు, ఇరుగు పొరుగు వారే ఎక్కువగా అడుగుతుంటారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. స్టడీ కంప్లీట్ అయ్యిందిగా.. జాబ్ వచ్చేసిందిగా.. అబ్బాయిని చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా? అంటూ పదే పదే విసిగిస్తుంటారు. ఈ ఒత్తిడి అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలకే ఉంటుంది.
కొంతమంది తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలకు గౌరవం ఇచ్చి వారికి నచ్చినప్పుడే పెళ్లి చేస్తారు. కానీ కొంతమంది పిల్లల పట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తారు. ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు, భవిష్యత్తులో బాగుండాలంటే, మన కాళ్ల మీద మనం నిలబడాలంటే మాకు కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయని ఎంత చెప్పినా పేరెంట్స్ అస్సలు వినిపించుకోరు. బలవంతంగా వివాహం చేస్తారు. అయితే తల్లిదండ్రులైనా, బంధువులైనా, ఇరుగుపొరుగు వారైనా పెళ్లి ఎప్పుడని పదే పదే నస పెడితే.. చిరాకు పడకుండా , వాళ్ల ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పి ఇలా తప్పించుకోండి.
ఇండియాలో కొంతమంది బంధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. లైఫ్‌లో ఎటువంటి కష్టం వచ్చిన మనకు తోడుగా ఉంటారు. వారి ప్రతి హ్యాపీ మూమెంట్‌ను మనతో పంచుకుంటారు. అలాంటి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి.. కూల్‌గా సమాధానం చెప్పండి. వారితో బంధాన్ని కోల్పోకుండా.. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూర్చోబెట్టి మాట్లాడండి. పెళ్లి అనేది వ్యక్తి గత నిర్ణయం. కాబట్టి మీ బంధువులకు మీరు ప్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అని ప్రశాంతమైన మనసుతో వారికి విశ్లేషించండి. అప్పుడు మీ బంధువులు మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలాగే మీ బంధువులతో ప్రేమ చెక్కుచెదరకుండా మునుపటిలాగే ఉంటుంది.
అయితే కొంతమంది బంధువులు, ఇంటి ఇరుగు పొరుగు వారు చాలా విషపూరితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారి రాక్షస ఆనందం కోసం కావాలని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు. వయసు రాలేదా ఇంకా? అంటూ మనసు బాధపడేలా కఠినంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా వివాహం విషయంలో ఇలాంటి వారి నోరు అదుపులో పెట్టాలంటే.. మీరు అనుకున్న లక్ష్యం చేరేవరకు వారికి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండండి. కానీ పెళ్లిపై ఒత్తిడి చేస్తున్నారని మీరు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం సరైనది కాదు.