Beauty tips: మీ పాదాలు అందంగా ఉండాలా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

by Kanadam.Hamsa lekha |
Beauty tips: మీ పాదాలు అందంగా ఉండాలా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
X

దిశ, ఫీచర్స్: ముఖం అందంగా కనిపించడం కోసం చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చర్మాన్ని మెరిపించడం కోసం రకరకాల క్రీములు, లోషన్‌‌‌‌లు వాడుతుంటారు. కానీ, పాదాల విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపరు. ఫలితంగా ఇవి పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లోనే సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. దీని వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి.

* మొదటగా ఒక టబ్బులో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో కొంచెం ఎప్సం సాల్ట్, ఒక విటమిన్- ఇ క్యాప్సిల్, కొన్ని చుక్కల రోజ్ వాటర్‌ను వేసుకోవాలి. తరువాత కాసేపు పాదాలను అందులో ఉంచాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉంచిన తరువాత బయటకు తీసి ఆరనిచ్చి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీని వల్ల పాదాలు అందంగా మృదువుగా మారతాయి.

* పచ్చిపాలలో రెండు స్పూన్ల చక్కెర కలిపి పాదాలపై మర్దనా చేయాలి. కాసేపటి తరువాత శుభ్రంగా కడిగి, పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారుతాయి.

* రెండు స్పూన్ల తేనెను తీసుకొని, అందులో ఒక స్పూన్ పసుపు కలిపి పాదాలకు రాయాలి. ఇలా 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనే పాదాలకు తేమను అందించి, మృదువుగా ఉండేలా చేస్తుంది.

* నాలుగు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్, మూడు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. రాత్రి పడుకునే ముందే ఈ విధంగా చేయడం వల్ల కాలి పగుళ్లు తగ్గిపోతాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* ప్రతి రోజూ స్నానం చేసే సమయంలో పాదాలను మడమలను బ్రష్ లేదా ప్యూమిస్ స్టోన్‌తో మృదువుగా రుద్దుకోవాలి. తరువాత శుభ్రంగా తుడుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.

* కొందరికి కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. డ్రస్ కలర్‌కు తగినట్లుగా నెయిల్ పాలిష్ వేసుకుంటారు. అయితే, ముందుగా కాలి వేళ్లకు ఉన్న పాలిష్ తొలగించిన వెంటనే కాకుండా కొన్ని నిమిషాల తరువాత మరో రంగును గోళ్లకు వేసుకుంటే మంచిది.

* కొందరు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకున్న వెంటనే సాక్సులు వేసుకుంటారు. అలా కాకుండా, మాశ్చరైజర్ పూర్తిగా చర్మంపై ఆరిన తరువాత సాక్సులు వేసుకోవాలి.

Advertisement

Next Story