- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చలికాలంలో కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి.. కారణం అదేనా ?
దిశ, ఫీచర్స్ : కళ్లలో నీరు కారడం మంచిదే కానీ ఎక్కువ నీరు కారడమే సమస్య అంటున్నారు నిపుణులు. కళ్ళ నుండి నీరు వచ్చినపుడు కళ్ళలో ఉన్న మురికి తొలగిపోతుందని, కళ్లకు తేమను అందిస్తాయని అంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కళ్లలో ఉండే లాక్రిమల్ గ్రంథి ద్వారా జరుగుతుంది. ఈ లాక్రిమల్ గ్రంథి కళ్లకు కవచంగా పనిచేస్తుంది. నిజానికి లా క్రిమల్ గ్రంథి కళ్ళకు తేమను అందిస్తూ ఆవిరైపోతుంది. అందుకే కళ్ళ నుంచి నీరు కారుతుంది.
కళ్లలో నీళ్లు రావడం సహజమేనా ?
కొందరికి అతిశీతల వాతావరణంలోకి వెళ్లినప్పుడు, వారి కళ్లలో నీళ్లు వస్తాయి. వాస్తవానికి, చల్లని గాలి కళ్ళుపొడిగా మారడానికి కారణమవుతుంది. వాటిని రక్షించడానికి కన్నీళ్లను ఉత్పత్తి చేయడానికి మెదడుకు సిగ్నల్ అందుతాయి.
చలికాలంలో కళ్లు పొడిబారకుండా ఉండాలంటే ఈ పద్ధతులను ఫాలో అవ్వండి..
చలికాలంలో కళ్లలో నీరు కారడం సర్వసాధారణం. అయితే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కళ్లలో నీళ్లు కారడం ప్రారంభించినప్పుడల్లా కొన్ని చిట్కాలను పాటించండి.
1. చల్లని వాతావరణంలో కప్పుకోవాలి.
2. అవసరం లేనప్పుడు చల్లని వాతావరణంలో బయటకు వెళ్లండి.
3. బయటకు వెళ్లే ముందు గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించేలా చూసుకోండి.
4. కెమికల్ ఫ్రీ ఐ డ్రాప్స్ ఉపయోగించండి.
5. కళ్లలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేయవచ్చు.
పొడి కళ్ళ లక్షణాలు..
చాలా మంది ప్రజలు డ్రై ఐస్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. అయితే వారికి దాని గురించి కూడా తెలియదు. వారు తరచుగా కళ్లలో నీరు రావడం సాధారణమని భావిస్తున్నారు. మీకు పొడి కళ్లు ఉంటే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు.
1. కళ్లలో దురదతో మంటగా అనిపించడం
2. కాంతి కారణంగా కళ్లలో నొప్పి
3. కళ్లలో అలసటగా అనిపించడం
4. నిరంతరం తలనొప్పి.