- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన వారికి RIP అని ఎందుకు పెడతారో తెలుసా.. అసలు ఈ పదం ఎక్కడ నుంచి వచ్చిందంటే!
దిశ, ఫీచర్స్: ఎవరైన చనిపోతే వారికి నివాళి ఆర్పిస్తూ.. వారి ఆత్మకు శాంతి కలగాలి అనే అర్థంతో RIP అని పెడతారు. అయితే.. ఈ RIP అనే పదం అసలు ఎక్కడ నుంచి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా. ఈరోజుకు చాలా మందికి RIP అనే పదానికి అసలైన అర్థం తెలియదు. కానీ చనిపోయిన వాళ్ల గురించి పెడతారు అని మాత్రం తెలుసు. అయితే.. RIP అనే పదానికి అసలైన అర్థం ‘శాంతిలో విశ్రాంతి’. ఇది లాటిన్ పదబంధమైన ‘రిక్విస్కాట్ ఇన్ పేస్’ నుండి ఉద్భవించిందనట. అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ‘శాంతియుతంగా నిద్రించడం’ అని అర్థం వస్తుంది.
RIP అనే పదం 18వ శతాబ్దంలో ఉద్భవించింది. అయితే.. నిజానికి క్రైస్తవ మతం కారణంగా ఈ పదానికి ప్రజాదరణ పెరిగింది. అప్పుడు మరణించిన వ్యక్తుల సమాధులపై ‘రిక్విస్‌కాట్ ఇన్ పేస్’ అని ఈ పదం రాసేవారట. తెలుగు భాషలో ప్రజలు.. మరణంచిన వ్యక్తి ఫోటో క్రింద ‘దేవుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించు’ అని వ్రాస్తారు. అదే ఆంగ్ల భాషలో ‘రిక్విస్‌కాట్ ఇన్ పేస్’ అని రాస్తారు. క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు ఈ పదాన్ని RIPగా మార్చి.. చనిపోయిన వారి సమాధులపై ప్రచురించడం జరిగింది. ఇక కాలక్రమేనా ఈ పదానికి ప్రజాదారణం పెరగడంతో.. అన్ని మతాల వారు కూడా RIP అని రాస్తున్నారు.