- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి వచ్చేసింది. చాలా మంది గణేశ్ నవరాత్రులంటే ఇష్టం ఉంటుంది. ఇక 9రోజులు ఎంతో సంతోషంతో భక్తులందరూ, భజనలు కోలాటాలతో పండుగను జరుపుకుంటారు. అయితే ఈ వినాయకుడిని పూజించే సమయంలో గుంజీలు తీస్తుంటారు. అసలు వీనాయకుడి దగ్గర ఎందుకు గుంజీలు తీయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాని రహస్యం ఏంటో తెలుసుకుందాం.
శివున్ని చూడటానికి శ్రీమహావిష్ణువు కైలాసానికి వెళ్తాడు. అయితే విష్ణువు తన ఆయుధామైన సుదర్శన చక్రాన్ని పక్కకు పెట్టి శివునితో ముచ్చపెడుతుంటే, వినాయకుడు ధగ ధగలాడుతున్న సుదర్శనచ్రాన్ని తీసుకొని మింగేస్తాడు. ఆ తర్వాత విష్ణు దేవుడు నా సుదర్శన చక్రం కనిపించడం లేదంటూ చాలా వెతుకుతాడు. అప్పుడు నిమ్మలంగా వినాయకుడు నేను మింగేసాగా అని చెప్తాడు. ఎంత బతిమిలాడినా ఇవ్వడు. దీంతో అతన్ని ప్రస్నంచేసుకోవడానికి విష్ణువు గుంజీలు తీస్తాడు.. విష్ణువు గుంజీలు తీస్తుంటే వినాయకుడి చాల నవ్వస్తుంది. అలా పగలబడి నవ్వడంతో ఒక్కసారిగా సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది. అయితే అలా వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టం. ఏ భక్తుడైనా సరే తన వద్దకు వచ్చి గుంజీలు తీస్తే కోరిన కోర్కె నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే అప్పటి నుంచి భక్తులందరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని.. ఎడమ చేత్తో కుడి చెవిని, కుడి చేత్తో ఏడుమ చేవిని పట్టుకొని గుంజీలు తీస్తూ తమ కోరిక నెరవేరాలని ఆ వినాయకుడిని కోరుకుంటారంట.