- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆషాడమాసంలో అత్త ముఖం కోడలు ఎందుకు చూడకూడదో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ఆషాడ మాసం ప్రారంభమైంది. దీంతో కొత్తగా పెళ్లైన వారు అత్తింటిని వదిలి పుట్టింటికి వస్తుంటారు. అయితే ఆషాడ మాసంలో కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి రావడం అనేది చాలా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఎందుకంటే ఈ మాసంలో అత్త ముఖం, కోడలు చూడకూడదు అంటారు. కాగా, అసలు ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తింటికాడ ఎందుకు ఉండకూడదు, అత్త ముఖం ఎందుకు చూడకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
అయితే ఈ ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన మహిళలు పుట్టింటికి రావడం , అత్త ముఖం చూడకూడదు, వీటిపై అనేక కథనాలు ఉన్నాయి.
ఆషాడ మాసం వ్యవసాయ పనుల్లో నిమగ్రమయ్యే సమయం. కాబట్టి కొత్తగా పెళ్లయిన పురుషుడు భార్య పక్కనే ఉంటే ఇతర పనులపై శ్రద్ద పెట్టలేడు. కాబట్టి వైవాహిక జీవితం నుంచి అతని ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారు. ఇందుకోసం కోడలు అత్త ముఖం చూడకూడదు అన్న ఒక నియమాన్ని పెట్టారంట.
మరో కథనం ప్రకారం.. కొత్తగా పెళ్లైన వారు అత్తింట్లో ఉండి ఉండి, కాస్త ఇబ్బందిగా ఫీలవుతారంట. అందుకోసమే వారిని కాస్త బయట ప్రపంచంలోకి తీసుక రావడానికి ఆషాడ మాసం పేరుతో అత్తింటికి దూరం చేస్తారంట. అంతే కాకుండా ఇలా దంపతులు దూరం దూరం ఉండటం వలన వారి దాంపత్య జీవితం చాలా బాగుంటుందని పెద్దల నమ్మకం. అంతే కాకుండా ఈ మాసంలో భార్య భర్తల కలయిక వలన గర్భం దాల్చడం మంచిది కాదంట. ఒక వేళ ఈ సమయంలో గర్భం దాల్చితే మండు వేసవిలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో తల్లీ బిడ్డకు అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఉన్నదున, ఆ షాడ మాసం పేరుతో భార్యభర్తలను వేరు వేరుగా ఉంచుతారంట.
ఇవి కూడా చదవండి:
రిలేషన్‌షిప్‌లో హద్దులు సెట్ చేసుకోవాలంటున్న భారతీయులు.. సర్వేలో వెల్లడి