జంతువులకు తోకలు ఎందుకు ఉంటాయో తెలుసా?

by Jakkula Samataha |
జంతువులకు తోకలు ఎందుకు ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మనం ఏ జంతువులను చూసినా దానికి తోక ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు జంతువులకు తోకలు ఎందుకు ఉంటాయి?ఆతోక వలన దానికి ఏమైనా ఉపయోగంఉందా? కాగా, దాని గురించే ఇప్పుడుతెలుసుకుందాం. చాలా వరకు కుక్క, పిల్లి,పులి, సింహం , జింక, ఇలా వేటికైనా సరే తోక మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ తోక వలన జంతువులకు చాలా ప్రయోజనాలు ఉంటాయంట. కానీ మనం దాని గురించి ఎప్పుడూ తెలుసుకోం. ఇప్పుడు వేటి తోకలు వాటికి ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.

చిరుత పులి,పులి, సింహం వంటి వాటికి తోక ఉండటం వలన అవి ఆ తోక సహాయంతో వేటాడటం, అది వేగంగా ఉరకడానికి తోక ఉపయోగపడుతుందంట. అలాగే కోతులు, ఉడుతలకుతోకలు ఉండటం వలన, అవి ఒక చెట్టు నుంచి మరోక చెట్టు మీదకు దూకడానికి, తమను తాము రక్షించడానికి, ఎగరడానికి ఆతోకలే సహాయపడుతాయంట. అలాగే, పక్షులు తోకల వల్లే వేగంగా పైకి ఎగరగలవు అంటున్నారు నిపుణులు. అందువల్లే జంతువులకు తోకలు ఉంటాయంట. ( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది దిశ, దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed