తరచూ మురికి బట్టలు ధరించడం దేనికి సంకేతమో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-01-28 10:50:43.0  )
తరచూ మురికి బట్టలు ధరించడం దేనికి సంకేతమో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చిత్తవైకల్యం(dementia) లేదా మానసిక రుగ్మత పెరిగేకొద్దీ రోగులు స్నానం చేయడానికి, శుభ్రమైన బట్టలు వేసుకోవడానికి ఆసక్తి చూపరని, స్వీయ సంరక్షణపై శ్రద్ధ కోల్పోతారని కన్సల్టెంట్- ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ స్పెషలిస్టులు చెప్తున్నారు. తరచూ మురికి బట్టలు ధరించడం అల్జీమర్స్‌కు ముందు ఉండే డెమెన్షియా అనే మానసిక రుగ్మతకు సంకేతంగా భావించవచ్చని సూచిస్తున్నారు. 2018లో మానసిక నిపుణుల అధ్యయనంలో పేర్కొన్న మానసిక రుగ్మతల జాబితాలో డెమెన్షియా, దాని లక్షణాలను పేర్కొన్నారు.

జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది అల్జీమర్స్ వ్యాధి లక్షణం. కానీ దానికి ముందు కూడా పలు రకాల మానసిక రుగ్మతలు, సంకేతాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అందులో ఒకటి తరచూ మురికి బట్టలు ధరించడం, పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఉంది. యూఎస్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్(NIA) కూడా తరచూ పరిశుభ్రత పాటించకపోవడం అనేది మానసిక రుగ్మతల జాబితాలో చేర్చింది. రోజుల తరబడి స్నానం చేయకపోవడం, మురికి బట్టలు ధరించడం క్రమంగా అల్జీమర్స్‌కు దారి తీసే ముందు కలిగే మానసిక రుగ్మతగా లేదా తేలికపాటి అల్జీమర్స్‌గా పేర్కొన్నది. దిక్కుతోచని తీవ్రమైన స్థితి కూడా మానసిక వైకల్యానికి దారి తీయవచ్చు అని తెలిపింది. పలు రకాల ప్రవర్తనలను మానసిక రుగ్మతలకు సంకేతంగా పేర్కొంటూ జాబితా విడుదల చేసింది.

డెమెన్షియా లక్షణాలు

* తరచూ కలత చెందడం, తీవ్రమైన ఆందోళన, కోపం కలిగి ఉండటం

*నిస్పృహతో వ్యవహరించడం లేదా విషయాలపై ఆసక్తి లేకపోవడం

* విషయాలను, ఇబ్బందులను దాచడం లేదా ఇతరులు ఏది చెప్పినా నమ్మడం

* లేని వాటిని ఊహించుకోవడం

* ఇంటికి దూరంగా సంచరించడం

* అసాధారణ లైంగిక ప్రవర్తనను చూపడం

* ఇతర వ్యక్తులను కారణం లేకుండా తిట్టడం లేదా కొట్టడం

* ఇతరుల చూపులను, మాటలను తరచూ అపార్థం చేసుకోవడం లేదా ఆపాదించుకోవడం

నిపుణుల అధ్యయం చెప్తున్నదేమిటి?

2018లో మానసిక రుగ్మతలపై మానసిక నిపుణులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం చిత్తవైకల్యం ఉన్నవారు, ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ మురికి బట్టలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తేలింది. అంతేకాదు వారు ధరించిన బట్టలపై ఆహారపు మరకలు ఉండటం, బట్టల రంగు తేలడం గమనించారు.

డెమెన్షియా ప్రభావాలు

చిత్తవైకల్యం అనేది మానసిక నిపుణుల ప్రకారం స్పృహలేకపోవడం, లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనలు దారి తప్పడం వంటి న్యూరో డీజెనరేటివ్ పరిస్థితి. ఇది రోజువారీ పనులను చేయడంలో మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. చివరికి సహనం కోల్పోయేలా కూడా చేస్తుంది. చిత్త వైకల్యం లేదా మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి తన గురించి తాను పట్టించుకోడు. కాబట్టి సంరక్షకులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. మానసిక నిపుణులు అల్జీమర్స్‌కు ముందు దారితీసే చిత్త వైకల్యాన్ని వివిధ దశలుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో అల్జీమర్స్ వ్యాధికి దారితీసే అగ్నోసియా చాలా సాధారణమైంది. ఇది అల్జీమర్స్‌కు దారితీసే నాలుగు లక్షణాలల్లో ఒకటి అని పిలువబడే హ్యూరిస్టిక్‌కు చెందినది. ఇక ఐదవ దశలో వ్యక్తి రోజువారీ జీవన కార్యకలాపాలు మందగిస్తాయి. అంటే స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం వంటివి చేయరు. తీవ్రమైన పరిస్థితికి చేరినప్పుడు తమపై తాము పూర్తిగా నియంత్రణ కోల్పోవడం, మల మూత్రాలు కూడా తమకు తెలియకుండానే విసర్జించడం వంటివి చేస్తుంటారు. ఇక ప్రకృతిని ఆస్వాదించడం, సమాచారాన్ని స్వీకరించడం వంటి విషయాల్లో నియంత్రణ కోల్పోతారు. ఇంద్రియాలు విఫలం అవడం కూడా ఇందుకు కారణం అవుతుంది. చిత్త వైకల్యం అనే దశ సాధారణంగా రెండు నుంచి నాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తర్వాత తీవ్రమైన అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. ఇక అల్జీమర్స్‌తో బాధపడుతున్నవారు తరచూ డిప్రెషన్‌ మూడ్ డిజార్డర్‌తో బాధపడుతుంటారని నిపుణులు చెప్తున్నారు. చిత్త వైకల్యం గురించి ఇక్కడ ఎందుకు చర్చించాల్సి వస్తుందన్నప్పుడు నిపుణులు చెప్తున్నదేమిటంటే తీవ్రమైన మానసిక వైకల్యం లేదా అల్జీమర్స్ నుంచి రోగిని రక్షించేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అవగాహన కలుగుతుంది. లక్షణాలను గుర్తించడం, గుర్తించన వెంటనే వైద్యులను సంప్రదించడం వీలవుతుంది. దీనివల్ల చిత్త వైకల్యం లేదా మానసిక రుగ్మత ప్రభావాన్ని తగ్గించవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు సూచిస్తున్నారు. తరచూ చిత్తవైకల్యం కలిగిన వ్యక్తులు మురికి బట్టలు ధరించకుండా ఉండేందుకు వారికి అవి అందుబాటులో లేకుండా చూడటం ద్వారా వారి ప్రవర్తన తీరులో మార్పు తీసుకురావచ్చని 2018లో నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది. చిత్త వైకల్యం కలిగిన రోగి సంరక్షకులు ఈ చర్యలను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed