ఎక్కువ రోజులు తల స్నానం చేయకపోతే ఏమవుతుందో తెలుసా ?

by Sumithra |
ఎక్కువ రోజులు తల స్నానం చేయకపోతే ఏమవుతుందో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొంత మంది బద్దకస్తులకు స్నానం చేయడం అంటే పెద్ద టాస్క్, ముఖ్యంగా తల స్నానం చేయడం అంటే మహాచిరాకు. కొంత మంది స్నానం చేసినా తల స్నానం చేయడానికి మాత్రం బద్దికిస్తూ ఉంటారు. ఇక చలికాలం వచ్చిందంటే చాలు చల్లటి నీళ్లని చూసే దడుచుకుంటారు. అయితే ఎక్కువ రోజులు తలస్నానం చేయకుండా ఉండడం వలన ఎన్నో జుట్టు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. తలస్నానం చేయకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, తలస్నానం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వారానికి కనీసం ఒక్కసారైనా చేయకపోతే జుట్టు పొడిబారడం, జట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. తల పై నూనెలు, బాక్టీరియా ఏర్పడి చిరాకు పుట్టి మాడు వాపు వస్తుంది. తలలో చుండ్రు ఏర్పడి జుట్టు రాలుతుంది. అలాగే తలలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు ఫోలికల్స్‌ను మూసివేస్తాయి. సరిగ్గా తలస్నానం చేయకపోతే జుట్టు చిట్లడం, చివర్లు చీలిపోతాయి. అంతే కాదు మొహం మీద మొటిమలు ఏర్పడతాయి. అలాగే ఇతర చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది.

ఇక మీ జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి. అదే ఒక్కరోజైనా తలంటు పోసుకుంటే తలలో ఉండే అదనపు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ప్రతిరోజు తలస్నానం చేస్తే తలలోని సహజ నూనెలు తొలగిపోయి జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

Advertisement

Next Story

Most Viewed