బిస్కెట్‌ను తెలుగులో ఏమంటారో తెలుసా?

by Jakkula Samataha |
బిస్కెట్‌ను తెలుగులో ఏమంటారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : బిస్కెట్స్ చూడగానే అందరికీ తినాలనిపిస్తది.ఎవరి ఇంట్లోనైనా సరే బిస్కెట్ ప్యాకెట్ తప్పని సరిగా ఉంటుంది. ఏదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లినా, మనం చాలా తేలికగా మనకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాం. ఇక చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.

అంతే కాకుండా పెద్ద వారు కూడా ఉదయం టీలో, సాయంత్రం స్నాక్స్‌గా బిస్కెట్స్ తింటుంటారు.మరీ ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే వారు, సమయం దొరికినప్పుడు తినడానికి బిస్కెట్స్‌నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.అందువలన మార్కెట్‌లో బిస్కెట్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే మనం బిస్కెట్స్ తింటూ ఉంటాం.కానీ ఆ బిస్కెట్‌ను తెలుగులో ఏమంటారో ఎవ్వరికీ తెలియదు. చాలా మంది దీని గురించి తెలుసుకోరు. అయితే ఇప్పుడు మనం బిస్కెట్స్‌ను తెలుగులో ఏం అంటారో తెలుసుకుందాం.

అయితే బిస్కెట్‌ను తెలుగులో రొట్టె బిళ్ల అని అంటారంట.అంతేకాదు బిస్కెట్‌ను అచ్చ తెలుగులో చక్కిలం అంటారంట. కానీ మన తెలుగు వారిలో ఎవ్వరూ బిస్కెట్‌ను అలా పిలవరు.అంతే కాదండోయ్ ఒక వేళ మనం షాప్‌కు వెళ్లి అలా అడిగినా వారు నోరెళ్లబెడుతారు తప్ప మనకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరు. అందుకే తెలుగును మరవకూడదని అంటారు మన పెద్దలు.

Advertisement

Next Story

Most Viewed