- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరీరంలో కొవ్వును కరిగించే మ్యాజికల్ ఫుడ్ ఏంటో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఊబకాయం. తరచూ కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో అత్యధికంగా బరువు పెరుగుతారు. పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఉదయాన్నే లేచి వాకింగ్ లు, జిమ్ లు చేస్తున్నారు. అలాగే పచ్చికూరగాయలు తింటూ అన్నం, రొట్టెలు తినడం మానేస్తారు. అయినా వారు అనుకున్నంతగా బరువు తగ్గలేరు. అయితే కొవ్వును కరిగించే మ్యాజికల్ ఫుడ్ ఉందని చాలా మందికి తెలియదు.. మరి అది ఏంటో తెలుసుకుందాం...
ఊబకాయంతో బాధపడుతూ బరువు తగ్గాలనుకునే వారు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాయగూరల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, సి, కె లు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర. ఇది తక్కువ కేలరీలు కలిగిన ఆకు కూర. పాలకూరను ఎక్కువగా తినడం వలన సులువుగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడితే, డైటరీ ఫైబర్ కొవ్వులో అవలీలగా కరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని, తెల్లరక్త కణాలను పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉండే పోషక విలువలు శరీరంలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి సహాయపడతాయి. ఇందులోని విటమిన్ ఏ చలికాలంలో చర్మం పొడిబారకుండా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.